టాలీవుడ్ లో అతడొక స్టార్ హీరో. రెమ్యునరేషన్ కూడా ఓ రేంజ్ లో తీసుకుంటూ ఉంటాడు. అయితే అతడికొక అలవాటు ఉంది. ఇండస్ట్రీలో తన స్నేహితులు, సన్నిహుతులని పిలిచి ప్రత్యేకంగా డ్రింక్ పార్టీ ఇస్తుంటాడు.

టాప్ హీరోతో మందు పార్టీ అంటే ఎవరు కాదంటారు..?సో ఆయన పార్టీ ఇచ్చిన ప్రతీసారి మన సెలబ్రిటీలు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ హీరోకి కామెడీ పంచ్ లు వేయడం కూడా సరదానే. తన సరదా మాటలతో అందరినీ నవ్విస్తూ.. సెటైర్లు వేస్తుంటాడు.

అయితే పార్టీకి వచ్చిన వారితో ఇతర హీరోల గురించి మాట్లాడడం.. వారి చేస్తోన్న సినిమాల గురించి సెటైరికల్ గా మాట్లాడడం చేస్తుంటాడట. ఈ హీరో చెప్పినంత సేపు కబుర్లు విని మందు తాగేసి వెళ్లిపోయే కొందరు తారలు అతడు వేసిన సెటైర్ల గురించి ఇతర హీరోలను మోసేవారట.

దీంతో వారు ఈ టాప్ హీరోపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వారు కోపంగా ఉన్నారని తెలిసి కూడా ఈ హీరో సెటైర్లు వేయడం మానలేదట. ఇప్పటికీ తన మందు పార్టీలు కొనసాగిస్తూనే ఉన్నాడట!