MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌

Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌

`బేబీ`తో ఒక్కసారిగా పాపులర్‌ అయిన హీరోయిన్‌ వైష్ణవి చైతన్య.. ప్రస్తుతం `ఎపిక్‌` చిత్రంలో ఆనంద్‌ దేవరకొండతో నటించింది. ఈ మూవీ విశేషాలను, తెలుగు అమ్మాయిలకు వస్తోన్న అవకాశాలపై స్పందించింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 08 2026, 09:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాలెంట్ ఉంటే ఆఫర్లు వస్తాయి వైష్ణవి చైతన్య
Image Credit : Asianet News

టాలెంట్ ఉంటే ఆఫర్లు వస్తాయి- వైష్ణవి చైతన్య

మనలో టాలెంట్‌ ఉంటే తెలుగు అమ్మాయిలకు కూడా ఆఫర్లు వస్తాయని చెప్పింది వైష్ణవి చైతన్య. ఆమె హీరోయిన్‌గా నటించిన చిత్రం `ఎపిక్‌ ఫస్ట్ సెమిస్టర్‌`. ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ మూవీకి ఆదిత్య హాసన్‌ దర్శకుడు. నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. తాజాగా వైష్ణవి చైతన్య మీడియాతో మాట్లాడుతూ, తెలుగు అమ్మాయిలకు ఆఫర్ల గురించి ఓపెన్‌ అయ్యింది. తెలుగు అమ్మాయిలకు కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది. టాలెంట్‌ ఉండి, పాత్రకి మనం సెట్‌ అవుతామని భావిస్తే మేకర్స్ ఛాన్స్ ఇస్తున్నారని, తనకు అలానే వస్తున్నాయని వెల్లడించింది. షార్ట్ ఫిల్మ్స్ నుంచి, ఇన్‌ఫ్లూయెన్సర్‌గా వచ్చిన తాను ఇప్పుడు ఆడియెన్స్ సపోర్ట్ తో ఇక్కడి వరకు వచ్చానని, తెలుగు అమ్మాయిలు పరిశ్రమలో ప్రత్యేకతని చాటుతున్నారు, అందులో తాను కూడా ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు వైష్ణవి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎపిక్‌ ఒక స్పెషల్‌ లవ్‌ స్టోరీ
Image Credit : Asianet News

ఎపిక్‌ ఒక స్పెషల్‌ లవ్‌ స్టోరీ

ఇక `ఎపిక్‌` మూవీ గురించి ఆమె చెబుతూ, మనం ఎన్నో లవ్ స్టోరీలు చూసుంటాం. కానీ, ప్రతి లవ్ స్టోరీలోనూ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఎపిక్ లో కూడా ఆ ప్రత్యేకత ఉంది. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు యూకేకి చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కలుస్తారు. లివ్ ఇన్ లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, ఆ సంభాషణల మీద నడిచే సినిమా. అమ్మాయి జీవితాన్ని ఒకలా చూస్తుంది. అబ్బాయి ఒకలా చూస్తాడు. అసలు వీరిద్దరూ ఎలా కలిశారు? వీరిద్దరి ఆలోచనలు ఏంటి? అనేది కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాలో హంగామా ఉండదు. హత్తుకునేలా ఉంటుంది` అని చెప్పింది వైష్ణవి.

Related Articles

Related image1
Ram Prasad Remuneration: రామ్‌ ప్రసాద్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే పారితోషికం.. బుల్లితెర స్టార్‌కి ఝలక్‌
Related image2
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
34
ప్రతి ఒక్క అమ్మాయిలో కడలి ఉంటుంది
Image Credit : Asianet News

ప్రతి ఒక్క అమ్మాయిలో కడలి ఉంటుంది

ఆమె ఇంకా చెబుతూ, `ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర సాఫ్ట్ గా, కామ్ గా ఉంటుంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడే అమ్మాయి. క్లారిటీ ఉన్న అమ్మాయి. ప్రతి ఒక్కరిలోనూ కడలి పాత్ర ఉంటుంది. కానీ, కుటుంబం వల్లనో, సమాజం వల్లనో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. బయటకు రాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదోక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే కడలి పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది. కథలోనూ, నా పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. ఎపిక్ ఎంచుకోవడానికి కారణమదే` అని చెప్పింది వైష్ణవి చైతన్య.

44
బేబీతో పోల్చడంపై వైష్ణవి రియాక్షన్‌
Image Credit : Asianet News

బేబీతో పోల్చడంపై వైష్ణవి రియాక్షన్‌

`బేబీ`తో `ఎపిక్`ని పోల్చడంపై వైష్ణవి చైతన్య రియాక్ట్ అవుతూ, బేబీ, ఎపిక్ సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవి. ఒత్తిడి లేదు కానీ, ఛాలెంజింగ్ గా తీసుకొని ఎపిక్ సినిమా చేశాము. ఈ సినిమాలో మమ్మల్ని చూస్తున్నప్పుడు బేబీ గుర్తుకు రాకపోతే మేము విజయం సాధించినట్టే. ఎపిక్ కచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం మాకు మొదటి నుంచి ఉంది. నాగవంశీ గారు సినిమా విషయంలో ఫుల్‌ ఫ్రీడమ్ ఇచ్చారు. అయితే `అలా వైకుంఠపురములో` మూవీలో చిన్న పాత్రలో నటించాను, ఇప్పుడు అదే బ్యానర్‌లో హీరోయిన్‌గా చేయడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవచ్చు అనే ఆశను నాకు కలిగించింది. నా జీవితంలో ఇలా జరగడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది` అని తెలిపింది వైష్ణవి చైతన్య. నెక్ట్స్ ఇదే బ్యానర్‌లో ఒక సినిమా, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నట్టు తెలిపింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Recommended image2
BiggBoss Telugu 10: బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఆ ముగ్గురి ఫ్రెండ్స్ కోసం హైపర్ ఆది స్పెషల్ సపోర్ట్
Recommended image3
Ram Prasad Remuneration: రామ్‌ ప్రసాద్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే పారితోషికం.. బుల్లితెర స్టార్‌కి ఝలక్‌
Related Stories
Recommended image1
Ram Prasad Remuneration: రామ్‌ ప్రసాద్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే పారితోషికం.. బుల్లితెర స్టార్‌కి ఝలక్‌
Recommended image2
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved