- Home
- Entertainment
- Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్ 'టాక్సిక్'కు ఓటీటీ షాక్
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్ 'టాక్సిక్'కు ఓటీటీ షాక్
Toxic OTT Deal: గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన 'టాక్సిక్' సినిమా ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదు. సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఓటీటీ సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి.

టాక్సిక్ కలెక్షన్లు
పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' సినిమా ఆగస్టు 26న థియేటర్లలో రిలీజైంది. కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదలైంది. సాక్‌నిల్క్ రిపోర్ట్ ప్రకారం, 'టాక్సిక్' ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.338 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో రూ.300 కోట్ల మార్క్‌ను అందుకోవడానికి ఇంకా రూ.7 కోట్లు మాత్రమే అవసరం. ఈ సినిమా రూ.293 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా `టాక్సిక్`
ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి వంటి పెద్ద స్టార్స్ ఉన్నా.. డైరెక్టర్ వారిని సరిగ్గా వాడుకోలేదనే విమర్శలు వచ్చాయి. సినిమాలో 18+(ఏజ్) సీన్లు ఎక్కువగా ఉన్నాయని, ఇది ఒక అడల్ట్ సినిమా అనే ప్రచారం జరిగింది. కేజీఎఫ్ తర్వాత యశ్‌ను చూసి ఈ సినిమాకు వెళ్లిన అభిమానులకు 'టాక్సిక్' పెద్ద నిరాశను మిగిల్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.
ఓటీటీ డీల్.. అత్యాశకుపోతే మొదటికే మోసం
ఇప్పుడు 'టాక్సిక్' ఓటీటీ డీల్ కి సంబంధించిన అప్ డేట్ బయటకొచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందే, ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ రూ.200 కోట్ల ఆఫర్ ఇచ్చింది. మొదట రూ.150 కోట్లతో మొదలైన చర్చలు రూ.200 కోట్ల వరకు వెళ్లాయి. కానీ 'టాక్సిక్' టీమ్ ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. సినిమాపై ఉన్న నమ్మకంతో, రిలీజ్ తర్వాత ఇంకా ఎక్కువ ధరకు అమ్మవచ్చనే అత్యాశతో వారు ఈ డీల్‌ను రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది.
రూ. 200కోట్లు పోయి 30 కోట్లకు వచ్చి బేరం
కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సినిమా అనుకున్నంతగా ఆడకపోవడంతో, అదే ఓటీటీ సంస్థ ఇప్పుడు కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు 'బాలీవుడ్ హంగామా' రిపోర్ట్ చేసింది. ఇది చిత్ర యూనిట్‌కు తీవ్ర నిరాశను కలిగించింది. ప్రస్తుత సమాచారం ప్రకారం, 'టాక్సిక్' ఓటీటీ డీల్ ఇంకా ఫైనల్ కాలేదు. దీనిపై చిత్ర యూనిట్ కూడా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. పలు ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మొత్తంగా టీమ్ అతి నమ్మకం తట్టిగా దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. ఇప్పటికే థియేట్రికల్‌గా కోట్లల్లో నష్టంతో ఉన్న నిర్మాతలకిది మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయ్యిందని చెప్పొచ్చు.

