Asianet News TeluguAsianet News Telugu

‘స్వాతిముత్యం’ టీజర్ ట్రైలర్ విడుదల.. ఆద్యంతం ఆసక్తికరం.!

యంగ్ స్టార్ గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘స్వాతి ముత్యం’. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ ట్రైలర్ ను విడుదల చేయగా.. ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 

Swathimuthyam teaser trailer released, Interesting throughout!
Author
First Published Sep 14, 2022, 6:24 PM IST

యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న రొమాంటిక్ ఫిల్మ్ "స్వాతిముత్యం" (Swathimuthyam). బెల్లంకొండ వారసుడు, యంగ్ స్టార్ గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాకు లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించారు. 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడి జీవితం..  ప్రేమ, పెళ్లి, ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ ఎలా సాగిందన్నదే ఈ చిత్ర కథగా ఉండనుంది. మరికొద్ది రోజుల్లో మూవీ థియేటర్లలో రిలీజ్  కానుంది. 

ఈ సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్ ఇస్తూ చిత్రపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు.  ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్రం నుంచి ‘టీజర్ ట్రైలర్’పేరిట అదిరిపోయే వీడియోను విడుదల చేశారు. హీరో గణేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ అప్డేట్ ను అందించినట్టు  తెలిపారు. ఇదిలా ఉంటే  స్వాతిముత్యం టీజర్ ట్రైలర్ ఆద్యంతం సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతుంది. టీజర్ ట్రైలర్ లో హీరోహీరోయిన్ సంభాషణ ఆకట్టుకుంటోంది. " మన బాలూ ఏంచేసాడో కొంచం నీకర్థమయ్యేలా చెబుతాను...
చెప్పండి... అంటే .....అదీ....! కొంపదీసి ఏదన్నా ప్రాబ్లమా
ప్రాబ్లమా.. ప్రాబ్లమ్ ఏముంటుందండి...? మీరింకా సింగిల్ గా ఎందుకుండిపోయారో నా కిప్పుడర్ధమయింది" వంటి సంభాషణలు వినిపిస్తున్నాయి. 

ఈ చిత్రంలో యంగ్ స్టార్స్ గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా, సూర్య తేజ ముసునూరు సినిమాటోగ్రఫీ బాధ్యతలు అందిస్తున్నారు.  ఎడిటర్ గా నవీన్ నూలి అద్భుతమైన వర్క్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios