Asianet News TeluguAsianet News Telugu

ఈ చేతులతో నేనే.. వేణుమాధవ్ మృతిపై ఎస్వీ కృష్ణారెడ్డి ఎమోషనల్!

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతితో చిత్రపరిశ్రమ శోకంలో మునిగిపోయింది. కోదాడలో జన్మించిన వేణుమాధవ్ హాస్య మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించాడు. 1996లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి హాస్య నటుడిగా అనేక విజయాలు సొంతం చేసుకున్నాడు. 

SV Krishna Reddy gets emotional about Venu Madhav
Author
Hyderabad, First Published Sep 25, 2019, 6:48 PM IST

వేణుమాధవ్ మృతిపై ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఎమోషనల్ అయ్యారు. వేణుమాధవ్ ని చిత్ర పరిశ్రమలోకి తీసుకువచ్చిందే ఎస్వీ కృష్ణారెడ్డి. 1996లో సంప్రదాయం చిత్రంలో వేణుమాధవ్ కు ఆయన అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కమెడియన్ గా వేణుమాధవ్ ఇక వెనుదిరి చూసుకోలేదు. 

తొలిప్రేమ, తమ్ముడు, గోకులంలో సీత, సింహాద్రి, దిల్, సై, లక్ష్మీ, వెంకీ, పోకిరి లాంటి ఎన్నో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో వేణుమాధవ్ నటించారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వేణుమాధవ్ నిన్ననే హాస్పిటల్ లో జాయిన్ అయితే మేమంతా వెళ్లి చూశాం. అప్పటికే డాక్టర్లు కష్టం అన్నట్లుగా చెప్పారు. 

కానీ వేణుమాధవ్ అవసరం చిత్రపరిశ్రమకు ఇంకా ఉంది. వేణుమాధవ్ ఎలాగైనా కోలుకోవాలని భావించా. కానీ ఈరోజు చేదువార్త వినాల్సి వచ్చింది. నాచేతులతో వేణుని ఇండస్ట్రీకి పరిచయం చేశా. నా కళ్ళముందు ఎదిగిననటుడు వేణుమాధవ్ అంటూ ఎస్వీ కృష్ణారెడ్డి ఎమోటినల్ అయ్యారు. అతడి మృతి నాకు ఇంకా నమ్మశక్యంగా లేదు అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. 

ఇక కమెడియన్ అలీ కూడా వేణుమాధవ్ మృతిపై మీడియాతో మాట్లాడారు. తాను, వేణుమాధవ్ కలసి అనేక చిత్రాల్లో నటించాం. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో హంగామా చిత్రంలో మేమిద్దరం హీరోలుగా నటించడం జరిగింది. గత పదిరోజులుగా వేణుమాధవ్ ఆరోగ్యం సరిగా లేదు. కొన్నిరోజుల క్రితం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మళ్ళీ అనారోగ్యం కావడంతో నిన్న ఆసుపత్రిలో చేరడం.. ఈ రోజు మృతి చెందడం జరిగింది అని అలీ తెలిపాడు. 

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..

Follow Us:
Download App:
  • android
  • ios