Asianet News TeluguAsianet News Telugu

అబ్బురపరిచే గ్రాఫిక్స్ తో సువర్ణసుందరి.. సెన్సార్ కంప్లీట్!

సీనియర్ హీరోయిన్ జయప్రద, పూర్ణ, హాట్ బ్యూటీ సాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం సువర్ణసుందరి. సూపర్ నేచురల్ అంశాలతో, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రం మే 31న విడుదలకు సిద్ధం అవుతోంది. 

Suvarna Sundari completes its censor
Author
Hyderabad, First Published May 24, 2019, 7:11 PM IST

సీనియర్ హీరోయిన్ జయప్రద, పూర్ణ, హాట్ బ్యూటీ సాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం సువర్ణసుందరి. సూపర్ నేచురల్ అంశాలతో, అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రం మే 31న విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా సువర్ణసుందరి చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'యూఏ' సర్టిఫికెట్ జారీ చేశారు.  

తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రానికి విడుదల చేస్తున్నారు. తాము వెచ్చించిన బడ్జెట్ కన్నా అద్భుతమైన క్వాలిటీతో చిత్రాన్ని పూర్తి చేశామని నిర్మాత లక్ష్మి తెలిపారు. ఏ చిత్రంలో గ్రాఫిక్స్ ఆకట్టుకునేలా ఉంటాయని అన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

దర్శకుడు ఎంఎస్ఎన్ సూర్య ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ చిత్రంలో ఉన్న కంటెంట్ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందని తెలిపారు. సెన్సార్ సభ్యుల నుంచి సువర్ణ సుందరి చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని దర్శకుడు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios