Asianet News TeluguAsianet News Telugu

మా సినిమాతో 'బాహుబలి'కి సమాధానం ఇస్తాం.. నిర్మాత వ్యాఖ్యలు

 ఈ సినిమాతో బాహుబలి, KGF లాంటి సినిమాలకు తమిళ ఇండస్ట్రీ నుంచి సమాధానం ఇస్తాం అని అన్నారు.

Suriya 42 Movie Will Give Answer To Bahubali Movie
Author
First Published Mar 21, 2023, 11:28 AM IST


బాహుబలి   చిత్రం కలెక్షన్స్ లో చరిత్ర సృష్టించింది. ఆ తరువాత వచ్చిన పలు సినిమాలు ఈ రికార్డును బ్రేక్ చేస్తాయని పలువురు భావించినా బాహుబలి చిత్ర రికార్డును మాత్రం తాకలేకపోయాయి. కానీ  'బాహుబలి' సినిమాని కలెక్షన్స్ లో దాటాలని ప్రతీ పెద్ద సినిమా నిర్మాతకు ఉంటుంది. అందులో తప్పేమీ లేదు. అయితే అందుకోసం చాలెంజ్ లు విసిరితే మాత్రం కామెడీగా ఉంటుంది. అందులోనూ సోషల్ మీడియా రోజుల్లో ప్రతీది రచ్చ అవుతోంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే నోరు జారినట్లు అవుతోంది. ఇప్పుడు సూర్య 42 నిర్మాత  జ్ఞానవేల్ రాజా అదే చేసారు. దాంతో  అందరూ ట్రోల్ చేస్తున్నారు. 

సూర్య 42వ సినిమాని కమర్షియల్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని తమిళ ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా, తెలుగు నిర్మాతలు యువీ క్రియేషన్స్(UV Creations) వంశీ ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు.  . పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్య 42లో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది.   ఈ సినిమాని భారీగా 200 కోట్లతో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.   తాజాగా ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా తమిళ్ లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

 జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. సూర్య 42 సినిమాని ఆయన గత సినిమా కంటే మూడు రేట్లు ఎక్కువ ఖర్చుతో భారీగా నిర్మిస్తున్నాం. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ ఏప్రిల్ లో రిలీజ్ చేస్తాం. మేలో ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేస్తాం. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తయింది. సినిమాపై మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఈ సినిమాతో బాహుబలి, KGF లాంటి సినిమాలకు తమిళ ఇండస్ట్రీ నుంచి సమాధానం ఇస్తాం అని అన్నారు. దీంతో జ్ఞానవేల్ రాజా చేసిన కామెంట్స్ వైరల్ అవ్వగా తమిళ్ వాళ్ళు వీటిని మరింత వైరల్ చేస్తుంటే తెలుగు ఆడియన్స్ మాత్రం ట్రోల్ చేస్తున్నారు.  

 ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సూర్య 42 చిత్రానికి ఎడిటర్‌గా పనిచేస్తోన్న నిషద్ యూసుఫ్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కనున్న ఫాంటసీగా రానుందని తెలిపారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో సూర్య.. అరథార్, వెంకటర్, మాందాకర్, ముక్తార్, పెరుమంతార్ అనే ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. బాలీవుడ్ నటి దిశా పటానీ హీరోయిన్‌గా చేస్తోంది.  ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. 10 భాషల్లో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. ఇప్పటికే సూర్యకు అదిరిపోయే ఆల్బమ్స్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios