మరో ఐటమ్ సాంగ్ లో అలరించనున్న సన్నీ లియోనీ తాజాగా భూమి చిత్రంలో సన్నీని ఐటమ్ సాంగ్ కు ఒప్పించిన దర్శకుడు తెలుగులో రాజశేఖర్ గరుడవేగలోనూ సన్నీ ఐటమ్ సాంగ్
బాలీవుడ్ లో పాగా వేసిన పోర్న్ స్టార్ సన్నీ లియోనీ ఇటీవల హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఐటమ్ సాంగ్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. తాజాగా మరో ఐటమ్ సాంగ్ చేసేందుకు రెడీ అవుతున్న పోర్న్ బాంబ్ సన్నీ ఈ సారి అందాల ఆరబోతతో అల్లల్లాడించబోతోందట. ఓ వైపు అడల్ట్ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు ఐటమ్ క్వీన్ గా ఎదిగిన సన్నీ లియోన్ ఈ మధ్య రూట్ మార్చిందని తెలుస్తోంది. ఇటీవలే ఓ పాపాయిని దత్తత తీసుకున్న సన్నీ.. హీరోయిన్ ఆఫర్స్ తగ్గుముఖం పట్టడంతో రెండు చేతులా ఐటమ్ సాంగ్స్ చేసేస్తోంది. ఎక్కడ నుంచి కబురొస్తే అక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోతోంది.
బాలీవుడ్‌లోనూ నాలుగైదు చిత్రాల్లో ప్రత్యేక గీతాలు చేస్తోంది. 'బాద్షాహో'లో అమ్మడు ఇమ్రాన్ హష్మీతో కలసి సెగలు పుట్టించిన వైనం మరచిపోక ముందే... తాజాగా 'భూమి' చిత్రంలో మరింత ఘాటైన సాంగ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సంజయ్ దత్ , అతిథి రావ్ హైదరీ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన 'భూమి' చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాలోని కీలకమైన మలుపులో వచ్చే ఈ పాటకోసం ఏరి కోరి సన్నీలియోన్‌ను తీసుకున్న దర్శకుడు ఓమంగ్ కుమార్ ఆమెపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడని తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటివరకూ సన్నీ చేసిన పాటలన్నీ ఒకెత్తు అయితే ఇది మరొక ఎత్తు అవుతుందని నమ్మకంగా చెప్తున్నాడు.
తెలుగులో రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 'పీఎస్వీ గరుడవేగ'లో ఐటమ్ సాంగ్ తో అలరించబోతోంది సన్నీ.
