Asianet News TeluguAsianet News Telugu

డేట్ ఇస్తా.. కానీ ముంబై రండి అంటోంది..

  • బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్స్ అందర్నీ మించిన సన్నీ లియోనీ
  • సన్నీ లియోనీ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనాలన్నా కండిషన్స్
  • డేట్స్ కావాలని వచ్చిన వారికి కేవలం ముంబైలో మాత్రమే షూటింంగ్ అని చెప్తున్న సన్నీ

 

sunny leone conditions to south producers

బాలీవుడ్ స్టార్ స్టేటస్ దక్కించుకున్న పోర్న్ స్టార్ సన్నీ లియోనీ కి ఇప్పుడు దేశవ్యాప్తంగా యమా క్రేజు వచ్చింది. ఈ క్రేజ్ దృష్ట్యానే బాలీవుడ్ ఐటమ్ గర్ల్ అంటే కేవలం సన్నీయే అనిపించుకున్న పోర్న్ స్టార్.. ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల్లోనే కాక ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తూ క్రేజ్ సంపాదిస్తోంది. తెలుగులో సన్నీ మంచు మనోజ్ సరసన కరెంట్ తీగ సినిమాలో లేలే నా రాజా పాటతో అలరించింది.

 

ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీనే కాకుండా ఇతర రీజనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలను కాస్త ఎక్కువగా ఫోకస్ చేసింది. సన్నీ ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తుంది.  ఈ బ్యూటీ తాజాగా రాజశేఖర్‌ చిత్రం ‘పి.యస్‌.వి.గరుడ వేగ 126.18ఎం’లో ఓ సాంగ్ లో  చేసింది. ఈ షూటింగ్ కూడా ముంబైలోనే జరిగింది. దీనికి కారణం సన్నీ కండిషన్సే. హైదరాబాద్ లో జరగాల్సిన ఈ షూటింగ్ సన్నీ పెట్టిన కండిషన్స్ వల్ల ముంబైలో జరిగింది.

 

సన్నీ లియోనీ ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనాలన్నా కండిషన్స్ మాత్రం దర్శకనిర్మాతలకు దిమ్మ దిరిగేలా చేస్తున్నాయి. తన డేట్స్ కావాలని వచ్చిన వారికి అవి ఇస్తానని, అయితే కేవలం ముంబైలో మాత్రమే షూటింంగ్ పూర్తి చేసుకోవాలని చెప్తోందట.        

 

ఇప్పుడు సన్నీలియోన్ ఎటువంటి షూటింగ్స్ పెట్టుకున్నా... ప్రతి ఒక్కరూ ముంబై వెళ్ళాల్సిందే. ముంబైలో లొకేషన్స్ లో షూటింగ్ పెట్టుకుంటేనే సన్నీలియోన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అందుకే ఈ బ్యూటీ సౌత్ మేకర్స్ కి ముందుగానే ముంబైలో షూటింగ్ అంటేనే నా దగ్గరకి రండి అని గట్టిగా చెబుతుందట.

Follow Us:
Download App:
  • android
  • ios