ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న క్రాక్‌ సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న శృతి, తన జ్ఙాపకాలను తిరిగి నెమరేసుకుంటుంది.

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన అందాల భామ శృతిహాసన్‌. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాదు గాయనిగా, సంగీత దర్శకురాలిగా మల్టీ టాలెంటెడ్‌ స్టార్‌గా పేరు తెచ్చుకుంది శృతి. హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న సమయంలోనే సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలలను ఎదుర్కొంది.

కొంత కాలం ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్న శృతిహాసన్‌, అతనితో బ్రేకప్‌ కావటంతో డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న శృతి తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న క్రాక్‌ సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న శృతి, తన జ్ఙాపకాలను తిరిగి నెమరేసుకుంటుంది.

గతంలో తాను చేసిన ఓ అండర్‌ వాటర్‌ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది శృతి హాసన్‌. హాట్ హాట్‌ అందాలను ఆరబోస్తూ చేసిన ఈ ఫోటో షూట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

View post on Instagram
View post on Instagram
View post on Instagram
View post on Instagram