Asianet News TeluguAsianet News Telugu

ఎంత డబ్బు ఇస్తామన్న నేను ఒప్పుకోలేదు: శ్రియ

హీరోయిన్స్ కేవలం తెరపై కనిపించే గ్లామర్ డాల్స్ గానే ఉండాలనుకోవటం లేదు. తమ  ఆలోచనలు, ఐడియాలజీ తో తెరవెనక తెలివైనవారిగా ముద్ర వేస్తున్నారు. మహిళల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. పోరాడుతున్నారు. తాజాగా శ్రియ...ఫెయిర్ నెస్ క్రీమ్ లపై తన గొంతు విప్పారు. అవి రాసుకుంటేనే పెళ్లి అవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.  ఆమె దగ్గరకు చేయమని వస్తున్న కమర్షియల్ యాడ్స్ విషయంలో  చాలా కండీషన్స్ పెడుతుందట.  

Shriya Saran comments on fairness cream ads
Author
Hyderabad, First Published Feb 10, 2019, 1:32 PM IST

హీరోయిన్స్ కేవలం తెరపై కనిపించే గ్లామర్ డాల్స్ గానే ఉండాలనుకోవటం లేదు. తమ  ఆలోచనలు, ఐడియాలజీ తో తెరవెనక తెలివైనవారిగా ముద్ర వేస్తున్నారు. మహిళల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. పోరాడుతున్నారు. తాజాగా శ్రియ...ఫెయిర్ నెస్ క్రీమ్ లపై తన గొంతు విప్పారు. అవి రాసుకుంటేనే పెళ్లి అవుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు.  ఆమె దగ్గరకు చేయమని వస్తున్న కమర్షియల్ యాడ్స్ విషయంలో  చాలా కండీషన్స్ పెడుతుందట.  

శ్రియ మాట్లాడుతూ ..‘‘నేను మొదటినుంచీ కొన్ని కమర్షియల్ యాడ్స్ క  వ్యతిరేకిని. ఫెయిర్‌నెస్‌ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారనీ, త్వరగా పెళ్ళవుతుందన్న ప్రకటన ఒకటి ఆ మధ్య బాగా వచ్చింది. ఆ ప్రకటన ముందు వచ్చింది నా దగ్గరికే. కాని నేను చేయనంటూ రిజక్ట్‌ చేశాను. ఆ క్రీమ్ వాడితేనే పెళ్ళవుతుందా? లేకపోతే లేదా? తెల్లగా ఉండడం అన్నది చర్మ సౌందర్యానికి సంబంధించినది. అది స్వతహాగా రావాలి తప్ప క్రీములు వాడితే రాదు. 

ఇలాంటి అబద్దాలను ప్రచారం చేసే యాడ్స్   ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడం నాకు నచ్చదు. అందుకే కొన్ని యాడ్స్ కు ఎంత డబ్బు ఇస్తామన్నా ఒప్పుకోను. వారికి క్లియర్ గా చెప్పేస్తూంటాను. జీవితమంటే కేవలం డబ్బు సంపాదనే  కాదు కదా. కొంత భాధ్యత ఉండాలి కదా. సమాజంలో బ్రతుకుతున్నాం అని గుర్తించుకోవాలి. 

అయితే హీరోయిన్‌ కాకముందు కొన్ని కాస్మోటిక్ ప్రొడక్ట్స్ కు మోడలింగ్‌ చేశారు కదా? అని అడిగేవాళ్లకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఆ ప్రకటనల ద్వారా అన్ని నిజాలే చెప్పారని అనను కానీ, మరీ అవాస్తవాలను కూడా వాస్తవాలుగా చూపించలేదు. అయినా ఆ ప్రకటనలు చేసే సమయంలో నా వయస్సు చాలా తక్కువ. అంత పరిపక్వత లేదు. ఇప్పుడు అలాంటివి ఒప్పుకోను..’’ అని శ్రియా చెప్పుకొచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios