Asianet News TeluguAsianet News Telugu

షకీలా మళ్లీ వస్తోంది.. ఈసారి అలా ఇలా కాదు..

  • మళయాల సూపర్ స్టార్ షకీలా మళ్లీ వస్తోంది
  • దాసరి సాయిరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన శీలవతి
  • శీలవతి చిత్రంలో బోల్డ్ గా తన సహజ శైలిలో ఆకట్టుకోనున్న షకీలా
shakeela coming back again in 250 movie selfie

జీ స్టూడియోస్‌ పతాకంపై మలయాళం సూపర్‌ స్టార్‌ షకీలా హీరోయిన్‌గా, సాయిరాం దాసరి దర్శకత్వంలో రాఘవ ఎమ్‌. గణేష్‌, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 'శీలవతి'. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. రిపబ్లిక్‌ డే సందర్భంగా హైదరాబాద్‌లో శీలవతి మూవీ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ''మా హీరోయిన్‌ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇదొక సైకలాజికల్‌ థ్రిల్లర్‌. మా నిర్మాతలు గణేష్‌, వీరబాబు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించగలిగాము. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్‌ క్రిష్‌ అద్భుతమైన నేపథ్య సంగతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది'' అన్నారు. 

నిర్మాతలలో ఒకరైన రాఘవ ఎమ్‌. గణేష్‌ మాట్లాడుతూ.. ''ఊహించిన దానికంటే ఈ చిత్రం బాగా వచ్చింది. ఈ రోజు నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటుంది. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.'' అన్నారు. 

మరో నిర్మాత వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. ''చాలా సినిమాలకు పీఆర్వోగా, కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా, రెండు సినిమాలకు నిర్మాతకు వ్యవహరించిన నేను ఈ చిత్రంతో మళ్లీ నిర్మాతగా మారుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. 

షకీలా, గీతాంజలి(ఫ్రూటీ), లడ్డు, అశోక్‌బాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్‌, కెమెరా: తరుణ్‌ కరమ్‌తోత్‌, డైలాగ్స్‌: యష్‌ యాదవ్‌, నిర్మాతలు: రాఘవ ఎమ్‌. గణేష్‌, వీరు బాసింశెట్టి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సాయిరాం దాసరి.

Follow Us:
Download App:
  • android
  • ios