MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Oscar Tributes: కోట శ్రీనివాసరావుని ప్రత్యేకంగా గౌరవించిన ఆస్కార్‌.. ఈ ముగ్గురి దిగ్గజాలకు అకాడమీ నివాళ్లు

Oscar Tributes: కోట శ్రీనివాసరావుని ప్రత్యేకంగా గౌరవించిన ఆస్కార్‌.. ఈ ముగ్గురి దిగ్గజాలకు అకాడమీ నివాళ్లు

Oscar Tributes: ఆస్కార్‌ అవార్డులు వేడుక ఈ సోమవారం ఉదయం గ్రాండ్ గా జరిగింది. ఇందులో మన తెలుగు నటుడు కోట శ్రీనివాసరావుతోపాటు మరో ముగ్గురు దిగ్గజ నటులకు ఆస్కార్‌ నివాళ్లు అర్పించింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 16 2026, 09:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోటశ్రీనివాసరావుకి ఆస్కార్‌ నివాళి
Image Credit : ANI

కోటశ్రీనివాసరావుకి ఆస్కార్‌ నివాళి

98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక సోమవారం ఉదయం(అమెరికాలో ఆదివారం సాయంత్రం) ఘనంగా జరిగింది. ఇందులో ప్రియాంక చోప్రా హోస్ట్ గా వ్యవహరించడం విశేషం. అలాగే దీపికా పదుకొనె రెడ్‌ కార్పెట్‌పై మెరిసింది. మన భారతీయ సినిమాలకు అవార్డులు రాకపోయినా, భారతీయ నటీమణులు ఆస్కార్ ఈవెంట్‌లో సందడి చేయడం విశేషం. అంతేకాదు మన దిగ్గజ నటులను ఆస్కార్‌ ప్రత్యేకంగా గౌరవించింది. తెలుగు నుంచి విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుని అకాడమీ వేడుక గుర్తు చేసుకుంటూ  నివాళ్లు అర్పించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఘనంగా ఆస్కార్‌ అవార్డుల వేడుక
Image Credit : X/ The Academy

ఘనంగా ఆస్కార్‌ అవార్డుల వేడుక

ప్రపంచ సినీ రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను అకాడమీ గౌరవించింది. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుక భారతీయ సినీ అభిమానులకు ప్రత్యేకమైన భావోద్వేగాన్ని అందించింది.

Related Articles

Related image1
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ పెద్ద 420, నేను అస్సలు నమ్మను.. బండారం బయటపెట్టిన నటి
Related image2
Krishnam Raju Favorite Hero: కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీకి అతుక్కుపోతాడు
35
భారతీయ దిగ్గజాలను గుర్తు చేసుకున్న ఆస్కార్‌
Image Credit : ANI

భారతీయ దిగ్గజాలను గుర్తు చేసుకున్న ఆస్కార్‌

ఈ వేడుకలో ప్రత్యేకంగా నిర్వహించిన ‘ఇన్ మెమోరియం’ సెగ్మెంట్ అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. గత ఏడాది మన నుంచి దూరమైన(చనిపోయిన) సినీ ప్రముఖులను స్మరించుకుంటూ వారి సేవలను అకాడమీ గుర్తుచేసుకుంది. ఈ జాబితాలో భారతీయ సినీ రంగానికి అపార సేవలు చేసిన పలువురు దిగ్గజాలకు కూడా చోటు దక్కింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుతో పాటు హిందీ చిత్రసీమ లెజెండ్స్ ధర్మేంద్ర, మనోజ్ కుమార్, అలాగే దక్షిణ భారత సినీ ప్రపంచంలో చిరస్మరణీయమైన నటి బి. సరోజా దేవి పేర్లు అకాడమీ అధికారిక వెబ్‌సైట్‌లో చోటు సంపాదించాయి.

45
తెలుగులో విలక్షణ నటుడిగా రాణించిన కోట శ్రీనివాస రావు
Image Credit : Facebook/Kota Srinivasa Rao

తెలుగులో విలక్షణ నటుడిగా రాణించిన కోట శ్రీనివాస రావు

ఆస్కార్ కార్యక్రమం ప్రారంభంలో దివంగత సినీ ప్రముఖులకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. అయితే ఆ వీడియోలో ధర్మేంద్రతో పాటు కొందరు భారతీయ నటీనటుల దృశ్యాలు కనిపించలేదు. అనంతరం ఆస్కార్ అవార్డుల అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం వారి పేర్లను ప్రత్యేకంగా చేర్చారు. సమయాభావం కారణంగా ట్రిబ్యూట్ వీడియోలో కొద్దిమందినే చూపించారని హాలీవుడ్ మీడియా పేర్కొంది. తెలుగు ప్రేక్షకులను ఐదు దశాబ్దాలకు పైగా తన నటనతో అలరించిన కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో 2025 జూలై 13న కన్నుమూశారు. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన విలన్‌గా, కామెడీ విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక రకాల పాత్రల్లో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు.

55
ధర్మేంద్రకి ప్రత్యేక నివాళి
Image Credit : instagram

ధర్మేంద్రకి ప్రత్యేక నివాళి

ఇక హిందీ సినీ రంగంలో మహానటుడిగా గుర్తింపు పొందిన ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో 2025 నవంబర్ 24న తుదిశ్వాస విడిచారు. ఆయనకు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. దేశభక్తి సినిమాలతో ప్రసిద్ధి చెందిన నటుడు మనోజ్ కుమార్ ఏప్రిల్ 4న కన్నుమూశారు. అలాగే దక్షిణ భారత సినీ రంగంలో సుదీర్ఘ కాలం తన నటనతో వెలుగొందిన నటి బి. సరోజా దేవి జూలై 14న పరమపదించారు. ఈ విధంగా భారతీయ సినీ దిగ్గజాల సేవలను ఆస్కార్   గుర్తుచేసుకోవడం భారతీయ అభిమానులకు గర్వకారణంగా చెప్పొచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా
Recommended image2
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image3
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Related Stories
Recommended image1
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ పెద్ద 420, నేను అస్సలు నమ్మను.. బండారం బయటపెట్టిన నటి
Recommended image2
Krishnam Raju Favorite Hero: కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీకి అతుక్కుపోతాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved