MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Sneha Ullal: ఐశ్వర్య రాయ్‌లా ఉన్నందుకే సల్మాన్ ఛాన్స్ ఇచ్చాడు.. ఇన్నేళ్ల తర్వాత సీక్రెట్ చెప్పిన స్నేహా ఉల్లాల్

Sneha Ullal: ఐశ్వర్య రాయ్‌లా ఉన్నందుకే సల్మాన్ ఛాన్స్ ఇచ్చాడు.. ఇన్నేళ్ల తర్వాత సీక్రెట్ చెప్పిన స్నేహా ఉల్లాల్

సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బ్రేకప్ తర్వాత, ఐష్ పోలికలతో ఉన్న స్నేహా ఉల్లాల్‌ను సల్మాన్ కావాలనే ఇండస్ట్రీకి తెచ్చాడని అనేవారు. ఇన్నేళ్ల తర్వాత ఆ ప్రచారంపై స్నేహా ఉల్లాల్ స్పందించి అసలు విషయం చెప్పింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 16 2026, 07:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐశ్వర్య పోలికలతో పాపులర్‌ అయిన స్నేహా ఉల్లాల్‌
Image Credit : Instagram

ఐశ్వర్య పోలికలతో పాపులర్‌ అయిన స్నేహా ఉల్లాల్‌

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్‌లా కనిపించే నటి స్నేహా ఉల్లాల్ మీకు గుర్తుంది కదా?   `ఉల్లాసంగా ఉత్సాహంగా` చిత్రంలో నటించి తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. 2005లో సల్మాన్ ఖాన్ 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో ఆమె నటన కన్నా, ఐశ్వర్య రాయ్ పోలికలతోనే (Doppelganger) రాత్రికి రాత్రే ఫేమస్ అయింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత, స్నేహా ఉల్లాల్ ఈ పోలికల గురించి, సల్మాన్‌తో తన అనుభవం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సల్మాన్‌ ఖాన్‌.. స్నేహా ఉల్లాల్‌ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడా?
Image Credit : Instagram

సల్మాన్‌ ఖాన్‌.. స్నేహా ఉల్లాల్‌ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడా?

సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బ్రేకప్ తర్వాత, ఐష్ లాంటి అమ్మాయిని కావాలనే తెచ్చాడని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. దీనిపై స్నేహా మాట్లాడుతూ.. 'అప్పట్లో పీఆర్ (PR) స్ట్రాటజీ అలా ఉండేది. నేను సల్మాన్ ఖాన్‌తో లాంచ్ అవుతున్నా కాబట్టి, జనాలు నన్ను అలా చూడటం సహజం. కానీ ఆ పోలికలు నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అప్పుడు నా వయసు చాలా చిన్నది, నాలో అహంకారం లేదు. నా అందం గురించి నేనెప్పుడూ పెద్దగా ఆలోచించలేదు' అని చెప్పింది.
36
ఐశ్వర్యతో స్నేహా ఉల్లాల్‌
Image Credit : Instagram

ఐశ్వర్యతో స్నేహా ఉల్లాల్‌

ఐశ్వర్య రాయ్‌ను కలిసిన క్షణాన్ని స్నేహా గుర్తుచేసుకుంది. 'నేను ఐశ్వర్యను ఒకసారి కలిశాను. ఆమె చాలా ప్రేమగా మాట్లాడారు. 'బాలీవుడ్ కుటుంబంలోకి నీకు స్వాగతం' అని చెప్పారు. కానీ మీడియా నన్ను ఆమెతో పోలుస్తుండటంతో, ఆమెకు కోపం వచ్చిందేమోనని భయపడ్డాను. అందుకే ఆమె దగ్గర 'దయచేసి నన్ను ద్వేషించకండి' అని అడిగాను. కానీ ఆమె చాలా పెద్ద మనసుతో నన్ను ఆప్యాయంగా పలకరించారు' అని స్నేహా చెప్పింది.
46
సల్మాన్‌ ఖాన్‌పై స్నేహా ఉల్లాల్‌
Image Credit : Instagram

సల్మాన్‌ ఖాన్‌పై స్నేహా ఉల్లాల్‌

సల్మాన్ ఖాన్‌కు 'ఆటిట్యూడ్' ఎక్కువ అనే ఇమేజ్‌పై స్నేహా మాట్లాడింది. 'షూటింగ్ సమయంలో సల్మాన్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను కొత్తదాన్ని అయినా ఆయన ఒక్కసారి కూడా సహనం కోల్పోలేదు. బయట జనాలు సల్మాన్ గురించి చెప్పే ఆటిట్యూడ్ గానీ, ప్రవర్తన గానీ నాకు సెట్‌లో కనిపించలేదు. ఆయన నన్ను చాలా ఓపికగా చూసుకున్నారు' అని స్నేహా తెలిపింది.
56
చిన్నప్పుడే ఐశ్వర్యా రాయ్‌లా ఉన్నావన్నారు
Image Credit : Instagram

చిన్నప్పుడే ఐశ్వర్యా రాయ్‌లా ఉన్నావన్నారు

అసలు నటి అవ్వాలనే ఆలోచనే స్నేహాకు లేదట. కాలేజీలో ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ స్నేహితులు ఆమెను చూశారట. వాళ్లే 'లక్కీ' సినిమా ఆడిషన్‌కు పిలిచారట. 'నేనెప్పుడూ నటిని అవ్వాలనుకోలేదు. ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు, నా చిన్న ప్రపంచంలో నన్ను ఆమెలా ఉన్నావని అనేవారు' అని స్నేహా చెప్పింది.
66
సినిమాలంటే ఇష్టం లేదని చెప్పిన స్నేహ
Image Credit : Instagram

సినిమాలంటే ఇష్టం లేదని చెప్పిన స్నేహ

'నేనొక 'టామ్‌బాయ్' లాంటిదాన్ని. గ్లామర్ ప్రపంచంపై నాకు అస్సలు ఆసక్తి లేదు. కానీ విధి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది' అని స్నేహా ఉల్లాల్ తన సినీ ప్రయాణం ఎలా మొదలైందో వివరించింది. మొత్తం మీద, ఐశ్వర్య రాయ్ పోలికలతో గుర్తింపు తెచ్చుకున్నా, స్నేహా ఉల్లాల్ తన వినయంతో అందరి మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Krishnam Raju Favorite Hero: కృష్ణంరాజుకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఆయన సినిమా వస్తుందంటే టీవీకి అతుక్కుపోతాడు
Recommended image2
Lavanya Tripathi: డైరెక్టర్ వేధించాడు.. సినిమా వదిలేస్తే కేసు పెట్టారు.. నిజం బయటపెట్టిన లావణ్య త్రిపాఠి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved