Asianet News TeluguAsianet News Telugu

రవితేజ అదృష్టం బావుంది.. డిజాస్టర్ నుంచి సేవ్ అయ్యాడు

మాస్ మహారాజ్ రవితేజ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' అనే చిత్రం కూడా ప్రారంభం అయింది.

Ravi Teja escapes from disaster movie
Author
Hyderabad, First Published Dec 3, 2021, 12:53 PM IST

మాస్ మహారాజ్ రవితేజ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' అనే చిత్రం కూడా ప్రారంభం అయింది. రవితేజ ఈ ఏడాది క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తో శుభారంభం చేశాడు. క్రాక్ ముందు రవితేజ నుంచి వచ్చిన నేల టికెట్టు, డిస్కోరాజా, అమర్ అక్బర్ ఆంటోని లాంటి చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. 

దీనితో Ravi Teja కెరీర్ లో మునుపటి జోరు తగ్గిందనే వాదనలు వినిపించాయి. కానీ రవితేజ క్రాక్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ప్రస్తుతం కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నప్పటికీ స్క్రిప్ట్ సరిగా లేని చిత్రాలని రిజెక్ట్ చేస్తున్నాడు. 

క్రాక్ తర్వాత రవితేజ కెరీర్ మళ్ళీ గాడిలో పడింది. ఇలాంటి సమయంలో పొరపాటు చేయకూడదు. ఆ విషయంలో రవితేజ అదృష్టం బావుందని ప్రచారం జరుగుతోంది. ఓ డిజాస్టర్ చిత్రం నుంచి రవితేజ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. 

యువ హీరో Raj Tarun నటించిన 'Anubhavinchu Raja' చిత్రం ఇటీవల విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్ తరుణ్, ఖాశీస్ ఖాన్ జంటగా నటించారు. మొదట దర్శకుడు ఈ చిత్ర కథతో రవితేజని సంప్రదించాడట. కన్నీరు రవితేజ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే అంశాలు కొన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. కానీ కథ పూర్తిగా బలంగా లేకపోవడంతో రవితేజ ఈ చిత్రానికి నో చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో దర్శకుడు రాజ్ తరుణ్ ని సంప్రదించి ఓకే చేయించుకున్నాడు. అన్న పూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. 

దీనితో రవితేజ తెలివిగా వ్యవహారించి పెద్ద పరాజయం నుంచి తప్పించుకున్నాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ యాక్షన్ మిక్స్ అయి ఉండే చిత్రాలకే ఒకే చెబుతున్నారు. కామెడీ, విలేజ్ డ్రామా చేసే మూడ్ లో రవితేజ లేనట్లు తెలుస్తోంది. 

Also Read: Akhanda: బి.గోపాల్ అలా.. బోయపాటి ఇలా.. బాలయ్య విషయంలో అదొక్కటే రిగ్రెట్

Follow Us:
Download App:
  • android
  • ios