MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?

Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?

Suma: తెలుగు రాష్ట్రాల్లో హీరోయిన్లకు మించిన స్టార్‌డమ్ ఉన్న ఏకైక యాంకర్ సుమ మాత్రమే. ఆమె తన కెరీర్‌లో ఎన్నో వందల షోలు చేశారు. కానీ, తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ షో ఎందుకంత స్పెషల్?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 15 2026, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యాంకరింగ్ క్వీన్‌గా సుమ కనకాల..
Image Credit : facebook.com/SumaKanakala

యాంకరింగ్ క్వీన్‌గా సుమ కనకాల..

తెలుగు బుల్లితెరపై ‘సుమ కనకాల’ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా తన సమయస్ఫూర్తి, చమత్కారం, అద్భుతమైన వాక్చాతుర్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని ‘యాంకరింగ్ క్వీన్’గా వెలుగు వెలుగుతున్నారు సుమ. టీవీ ప్రోగ్రామ్స్ మాత్రమే కాదు.. స్టార్ హీరోల ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు.. ఇలా ఏ పెద్ద కార్యక్రమమైనా హోస్ట్‌గా ముందుగా గుర్తుకువచ్చేది సుమనే! తెలుగు బుల్లితెర చరిత్రలో సుమ కనకాల ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సుమకు తన షోలలో బాగా నచ్చినది ఏదో తెలుసా?
Image Credit : suma insta

సుమకు తన షోలలో బాగా నచ్చినది ఏదో తెలుసా?

సుమ యాంకరింగ్ చేసిన ఎన్నో కార్యక్రమాలు అత్యంత ప్రజాదరణ పొందినప్పటికీ, అందులో ఆమెకు బాగా నచ్చిన షో ఏంటో తెలుసా? తన కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని ఆ కార్యక్రమం గురించి సుమ స్వయంగా వెల్లడించారు. సుమ చేసిన టీవీ షోలలో అత్యధిక రేటింగ్స్‌తో, సుదీర్ఘ కాలం సాగిన ల్యాండ్‌మార్క్ షో 'స్టార్ మహిళ'. ఈ షో తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదిగా నిలిచిపోయిందని సుమ ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో తెలిపారు.

34
ప్రతి తెలుగువారి ఇంట్లో భాగమైన కార్యక్రమం..
Image Credit : suma insta

ప్రతి తెలుగువారి ఇంట్లో భాగమైన కార్యక్రమం..

'స్టార్ మహిళ' అనేది కేవలం ఒక టీవీ గేమ్ షో మాత్రమే కాదు.. అది ప్రతి తెలుగు ఇంటిలోనూ ఒక అంతర్భాగంగా మారింది. దశాబ్ద కాలానికి పైగా దిగ్విజయంగా సాగిన ఈ కార్యక్రమం అనేక కుటుంబాల రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఈ షోపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణ ఎప్పటికీ వర్ణించలేనివని సుమ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా షో సాధించిన అసలైన విజయం గురించి చెబుతూ ఆమె కొన్ని ఎమోషనల్ విషయాలను పంచుకున్నారు.

44
సుమ మాటల్లోనే..
Image Credit : suma insta

సుమ మాటల్లోనే..

"ఆ రోజుల్లో తల్లులు తమ పిల్లలకు భోజనం తినిపించే సమయంలో టీవీలో 'స్టార్ మహిళ' ప్రోగ్రామ్ వేసి చూపిస్తూ తినిపించేవారు. ఆ విధంగా చిన్నతనంలో ఈ షో చూస్తూ పెరిగిన తరం ఇప్పుడు పెద్దవారయ్యారు. ప్రస్తుతం అమెరికా వంటి విదేశాలకు వెళ్లి మాస్టర్స్ (ఉన్నత చదువులు) అభ్యసిస్తున్న ఎంతోమంది తెలుగు యువతీ యువకులు ఇప్పటికీ నన్ను కలిసినప్పుడు ఆ జ్ఞాపకాలను పంచుకుంటారు. 'అక్కా.. చిన్నప్పుడు మా అమ్మ నీ ప్రోగ్రామ్ చూపిస్తూనే మాకు అన్నం తినిపించేది' అని విదేశాల్లో ఉన్న నేటి తరం యువత చెబుతుంటే నాకు ఎంతో సంతోషంగా, మనసుకు చాలా దగ్గరగా అనిపిస్తుంది" అని సుమ అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image2
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Recommended image3
RRR మిస్సయింది, రాజమౌళి 'వారణాసి'లో ఛాన్స్ కొట్టేసిన హాలీవుడ్ బ్యూటీ.. మహేష్ బాబుతో రొమాన్స్ ?
Related Stories
Recommended image1
60 ఏళ్ల కెరీర్ లో 800 సినిమాలు.. కైకాల సత్యనారాయణ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా?
Recommended image2
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved