Asianet News TeluguAsianet News Telugu

జీఎస్టీ వర్మ "శపథం".. ఒక్క సారిగా మారిన వర్మ

  • వర్మ జీఎస్టీకి ఫుల్ క్రేజ్
  • మహిళల నుంచి కూడా మద్దతు
  • జీఎస్టీ తర్వాత వర్మ శపథం
ramgopal varma shapatham after god sex and truth

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మూవీ ఆన్‌లైన్‌లో శనివారం ఉదయం 9 గంటలకు విడుదలైంది. శుక్రవారం నాడు ఈ సినిమాను విడుదల చేసినప్పటికీ టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో శనివారం నాటికి వాయిదా పడిండి. కాగా ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ మూవీ ఏంటి? ఎలా ఉంది విషయాలను పక్కనపెట్టేస్తే.. ఈ మూవీతో వర్మ, ఇందులో నటించిన పోర్న్‌స్టార్ మియా మాల్కోవా‌కు ఇంతకు ముందెన్నడూ లేనంత పబ్లిసిటీ వచ్చేయడంతో.. వర్మ తన ఫోకస్‌ను అప్ కమింగ్ మూవీకి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది.



ప్రస్తుతం ఈ వివాదాల దర్శకుడు కింగ్ నాగార్జున హీరోగా ఓ యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీకి ప్లాన్ చేశారు. గత ఏడాది నవంబర్ 20న ఈ మూవీ అన్నపూర్ణ స్టుడియో‌లో వైభవంగా ప్రారంభించారు వర్మ. రామ్ గోపాల్ వర్మ- నాగార్జున కాంబినేషన్‌లో 28 ఏళ్ల క్రితం వచ్చిన ‘శివ’ ఇప్పటికీ ఓ సంచలనమే. తిరిగి ఇన్నేళ్ల తరువాత మళ్లీ వీరి కాంబోలో మూవీ అంటే అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్లుగానే వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
 

కాగా ఈ చిత్రానికి ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ ప్రచారంలోకి వచ్చి సినీ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘శపథం’ అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ‘రివెంజ్ కంప్లీట్స్’ అనేది ఉపశీర్షిక. శివ 2, 'గన్' , 'సిస్టమ్' లాంటి పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ ‘శపథం’టైటిల్‌కే మొగ్గు చూపారట వర్మ. ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా.. ఆయన సరసన హీరోయిన్‌గా నటించేందుకు మైరా సరీన్ అనే మోడల్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ కంపెనీ బ్యానర్‌లో స్వయంగా ఆర్జీవీ నిర్మించడం మరో విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios