Asianet News TeluguAsianet News Telugu

వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమాకు నిర్మాత జేడీ కాదు

  • ఎన్టీఆర్ జీవితం ఆధారంగా వర్మ బయోపిక్
  • చిత్రానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ ఖరారు చేసిన వర్మ 
  • వర్మ తెరకెక్కకించబోయే సినిమాకు నిర్మాతగా జేడీ అంటూ రూమర్స్
  • జేడీ నిర్మాత కాదంటూ ఖండించిన రామ్ గోపాల్ వర్మ
ramgopal varma lakshmis ntr movie producer is jd chakravarthy

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ఎన్టీఆర్' జీవితం మీద సినిమా తీయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు ప్రకటించారు కూడా. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన అన్ని నగ్న సత్యాలు, సంఘటనలు చూపిస్తానని... ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిందెవరు? ముందు నుండి కడుపులో గుద్దింది ఎవరు? అనే విషయాలు వెల్లడిస్తానని రామ్ గోపాల్ వర్మ చెప్పడం.... తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.

 

 ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా అనేది చాలా వివాదాస్పద అంశాలతో కూడిన సినిమా. రేపు ఏదైనా తేడా వస్తే అంతే సంగతులు. నిర్మాతకు భారీ నష్టం తప్పదు. అందుకే ఈ వివాదాస్పద ప్రాజెక్టును చేయడానికి చాలా మంది నిర్మాతలు భయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించడానికి జెడి చక్రవర్తి ముందుకు వచ్చాడని వార్తలు వచ్చాయి. వర్మకు అత్యంత సన్నిహితుడు, శిష్యుడు అయిన జెడీ ఈ ప్రాజెక్టును తెరపైకి తేవడానికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో గుప్పుమంది. అయితే జేడీ... లక్ష్మీపార్వతిని కలిసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని... ఎన్టీఆర్ జీవితంపై తీస్తున్న బయోపిక్ కు జేడీకి సంబంధం లేదని వర్మ స్పష్టం చేశారు.

ramgopal varma lakshmis ntr movie producer is jd chakravarthy

 

తమ సినిమా కాన్సెప్టు ఏమిటి? ఏయే విషయాలు సినిమాలో ఫోకస్ చేస్తాం అనే వివరాలు వెల్లడించి ఆమెను కన్విన్స్ చేసినట్లు సమాచారం. అయితే ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత అది చూసి తాను అనుమతి ఇస్తానని లక్ష్మి పార్వతి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ రహస్యాలు ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన వాస్తవాలు అన్నీ కూడా ఈ సినిమాలో చూపిస్తానని, ఆయన జీవితం చివర్లో జరిగిన సంఘటనల వెనక ఉన్న వాస్తవాలు ఏమిటి? ఎవరు? ఇదంతా చేశారు అనే విషయాలు సినిమాలో ఉంటాయని రామ్ గోపాల్ వర్మ వెల్లడించంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

 

మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ అత్యంత నిజమైన సినిమాఅంటున్న వర్మ.. ఆయన శత్రువులు ఎవరో? నమ్మక ద్రోహులెవరో? ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను అని ఇప్పటకే ప్రకటించారు. ఈచిత్రం ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు వర్మను టార్గెట్ చేశారు. ఈ సినిమా విషయంలో తనను టార్గెట్ చేసిన వారికి వర్మ ఏ మాత్రం భయపడకుండా ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు.

 

లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ లాంటి అతి గొప్ప మహానుభావుడినే ప్రభావితం చేసిందంటే ఆమెలో ఏదో ప్రత్యేకత లేకపోతే ఎన్.టి.ఆర్ గారు ఎందుకు ఆకర్షితులౌతారు అనే ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం నేను నా సినిమాలో చూపించదలచుకున్నాను. అని వర్మ వాదిస్తున్నారు. నిర్ణయం ఏదైనా "బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్" అనే నిజాయతీ ఉన్నప్పుడే వాళ్లే నిజమైన ఫాల్లోవర్లు అవుతారు. లేకపోతే వాళ్ళు దొంగ ఫాల్లోవర్లు.... అలాంటి వారి విషయాలు తన సినిమా ద్వారా బయట పెడతానని వర్మ తేల్చి చెబుతున్నారు.

 

చరిత్ర ఎవరో చింపేస్తే చిరిగిపోవడానికో కాల్చేస్తే కాలిపోవడానికో దాచేస్తే తెలియకుండా దాగిపోవడానికో వెర్రిబాగులది కాధు ..తెలుగు చరిత్రని గర్వంగా తల ఎత్తుకు తిరిగేలా చేసిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు  గారిది. దాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను అని వర్మ అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios