సంచలన దర్శకుడు అని తన ఇంటిపేరును మార్చుకున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో తన జీఎస్టీ సినిమాతో పెద్దయెత్తున చర్చకు తెరలేపిన సంగతి తెలిసిందే. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అంటూ జీఎస్టీకి కొత్త అర్ధం చెప్పిన వర్మ పోర్న్ స్టార్ మియా మల్కోవాతో బాగానే ట్రై చేశాడు. ఆన్ లైన్ లో టికెట్ కూడా పెట్టి 150 రూపాయలకు జీఎస్టీని జనాలకు చూపించేస్తున్నాడు.ఇలా పోర్న్ స్టార్ తో సినిమా తీసిన వర్మకు ఇప్పుడు ఓ వ్యక్తి పోటీ వచ్చేస్తున్నాడు. సూర్య ఆకొండి అనే వ్యక్తి తను కూడా జీఎస్టీ అనే ఫిలిం తీస్తున్నట్లు ప్రకటించాడు. ఓ పోస్టర్ కూడా ఇచ్చేశాడు. సూర్య తీసే జీఎస్టీ కి అర్ధం జెంట్స్.. సెక్స్ అండ్ ట్రూత్. వర్మ సినిమాలో మియా మాల్కోవా నటిస్తే.. ఇందులో మేల్ పాలకోవా నటించాడట. మేల్ పాలకోవా యొక్క ఫిలాసఫీ చూపిస్తానంటూ ప్రచారం చేసేస్తున్నాడు. త్వరలో టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు చెప్పడం విశేషం. అంతే కాదు.. వర్మ అయితే 150 రూపాయలు వసూలు చేసినా.. తను మాత్రం ఫ్రీగానే ఈ ఫిలాసఫీ ఫిలిం చూపిస్తాడట. వర్మలా ప్రమోట్ చేయడం అందరి వల్లా కాదు.. ఒకవేళ చేసినా అంతగా ప్రచారం దక్కదు. మరి ఈ మేల్ జీఎస్టీ ఎంతవరకూ ఆకట్టుకుంటుందో.. ఎవరిని టార్గెట్ చేస్తుందో చూడాలి(వర్మకు కౌంటర్ గా తీస్తున్నారని అంటున్నారు).