Asianet News TeluguAsianet News Telugu

జీఎస్టీ చూసిన మహిళల నుంచి వర్మకు ఫుల్ సపోర్ట్

  • వర్మకు జీఎస్టీ చూసిన మహిళల నుంచి ఫుల్ మద్దతు
  • జీఎస్టీలో స్త్రీ అందాన్ని వర్ణించిన తీరు అద్భుతమని మహిళల ప్రశంసలు
  • మహిళల ప్రశంసలతో ఉబ్బితబ్బిబ్బవుతున్న వర్మ
ram gopal varma gets huge support from women for gst god sex truth

'జీఎస్‌టీ' (గాడ్, సెక్స్& ట్రూత్) చిత్రంపై ఓవైపు మహిళ సంఘాల ఆందోళనలు కొనసాగుతుంటే.. మరోవైపు కొంతమంది మహిళల నుంచి మాత్రం వర్మకు మద్దతు లభిస్తుండటం గమనార్హం. నేటి ఉదయం 9గం.కు సినిమా విడుదలవడంతో.. కొంతమంది మహిళలు కూడా ఈ చిత్రాన్ని చూసినట్లు తెలుస్తోంది. చూడటమే కాదు.. వర్మకు మద్దతునిస్తూ ఆయనకు మెసేజ్‌లు కూడా పెట్టారట. ఈ విషయాన్ని ఆర్జీవి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

 

గాడ్ సెక్స్&ట్రూత్ చూసిన తర్వాత ఓ మహిళ ఇలా మెసేజ్ చేసిందంటూ వర్మ దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 'ప్రతీ సీన్ వణుకు పుట్టించేలా ఉంది. ఇది పోర్న్ కాదు, ఫిలాసఫీ అంతకన్నా కాదు.. స్త్రీ శరీరంలోని ప్రతీ భాగాన్ని శృంగారపరమైన ఆధ్యాత్మికతతో కూడిన పవిత్ర పద్దతిలో ఆరాధించడం' అని అందులో సదరు మహిళ పేర్కొనడం గమనార్హం.

 

'ఓ బాలికగా సామాజిక కట్టుబాట్లు, నైతిక విలువల వల్ల నేను అణ‌చివేత‌కు గుర‌య్యాను. కానీ జీఎస్‌టీ చూసిన త‌ర్వాత దేవుడు న‌న్ను మ‌హిళ‌గా పుట్టించినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను. మ‌హిళ శృంగార స్వేచ్ఛ గురించి చెప్పిన విధానం నాకు న‌చ్చింది. నా శృంగార హ‌క్కుల గురించి ఆలోచించేలా చేసింది. వ‌ర్మ‌కి, మియా మాల్కోవాకి ధ‌న్య‌వాదాలు' అని మరో మహిళ తనకు మెసేజ్ చేసినట్లు ఆర్జీవి ట్వీట్ చేశారు.

 

మియా మాల్కోవాతో 'గాడ్ సెక్స్&ట్రూత్'ను తెరకెక్కించడంలో ఉన్న అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని తనను అభినందిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వర్మ తెలిపారు. ఈ సినిమా చూసిన ప్రతీ మహిళ.. తప్పకుండా దీన్ని ప్రేమిస్తుందని, అలాగే స్త్రీ అందాన్ని తాను ఎంతలా గౌరవిస్తానో అర్థం చేసుకుంటుందని పేర్కొన్నారు.

 

వర్మ 'జీఎస్‌టీ'కి ఊహించిన దానికంటే అనూహ్య స్పందన రావడం గమనార్హం. టికెట్ రేటు రూ.150 పెట్టినా సరే, సినిమా చూడటానికే చాలామంది మొగ్గుచూపారు. వర్మ అసలేం చూపించి ఉంటాడో అన్న ఆసక్తితోనే ఎక్కువ మంది 'జీఎస్‌టీ' సైట్‌ను క్లిక్ చేస్తున్నారు.

 

'జీఎస్‌టీ'ని వర్మ ఎంత బడ్జెట్ లో తెరకెక్కించారో తెలియదు గానీ.. మరీ ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టి ఉండరు. ఈ లెక్కన ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే.. 'జీఎస్‌టీ'కి కలెక్షన్ల పంట పండినట్లే. ఈ చిత్రాన్ని నిర్మించిన యూఎస్ ప్రొడక్షన్ హౌజ్ కలెక్షన్ల వివరాలు బయటపెడుతుందో లేదో.

Follow Us:
Download App:
  • android
  • ios