Asianet News TeluguAsianet News Telugu

విజయ్ “లియో”లో రామ్ చరణ్ ?

ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన ఓ అప్డేట్ సిని వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

Ram Charan to be part of Thalapathy Vijay Leo
Author
First Published Feb 9, 2023, 11:21 AM IST


తమిళ్ తోపాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘లియో’ (Leo). ‘లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్’‌లో భాగంగా వస్తున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ (Lokesh Kangaraj)డైరక్షన్ చేస్తూండగా.. తమిళ సూపర్ స్టార్ విజయ్ (Vijay) హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో ఈయనతో పాటు ఎంతోమంది ప్రముఖులు కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన ఓ అప్డేట్ సిని వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

అదేమిటంటే... ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ కూడా చేస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. లియో నుంచి అనౌన్స్ చేసిన ఫస్ట్ టీజర్ లో తెలంగాణ కి చెందిన కార్ విజువల్ కనిపించడం ఆసక్తిగా మారింది. దీనితో ఇది చరణ్ రోల్ కి ఏమన్నా లింక్ ఉందని వార్తలు మొదలయ్యాయి. అయితే  చరణ్ అయితే ఈ సినిమాలో ఉన్నాడో లేదో  అఫీషియల్ గా టీమ్ కన్ఫర్మ్ చేసి అయితే చెప్పలేదు.

అలాగే ఈ మూవీలో దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్ జోడీగా త్రిష (Trisha) నటించనుందని కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర టీమ్  ప్రకటించింది.  ఈ చిత్రం నుంచి త్రిష తప్పుకుందంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. మూవీ టీం కొన్ని విభేధాలు రావడం వల్ల ఈ బ్యూటీ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా త్రిష తల్లి ఉమా కృష్ణన్ క్లారిటీ ఇచ్చింది. ఉమా కృష్ణన్ (Uma Krishnan) మాట్లాడుతూ.. ‘లియో ప్రస్తుతం షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతోంది. త్రిష కూడా అక్కడే ఉంది. తన క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్‌లో బిజీగా ఉంది. ఆ నెట్‌లో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు’ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. త్రిష సైతం కశ్మీర్‌‌లో ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ వీడియోని షేర్ చేసింది. దీంతో ‘లియో’ సినిమా విషయంలో వచ్చినవన్నీ రూమర్స్ మాత్రమేనని అర్థమవుతోంది.

 ఇక ఈ సినిమాను 2023 అక్టోబ‌ర్ 19వ తేదీన రిలీజ్‌ చేయనున్నారు.ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్రం త‌మిళ్..తెలుగు..హిందీ..క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios