Asianet News TeluguAsianet News Telugu

ఛాన్సుల్లేని రకుల్.. చివరకి ఆ హీరోతో కూడా!

'స్పైడర్' సినిమా డిజాస్టర్ తో టాలీవుడ్ లో పత్తా లేకుండా పోయింది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా ఎఫెక్ట్ తో ఇక్కడ ఆమెకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో కోలివుడ్ కి వెళ్లి అక్కడ ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తోంది.

rakul preet singh to romance with balakrishna
Author
Hyderabad, First Published Feb 7, 2019, 9:57 AM IST

'స్పైడర్' సినిమా డిజాస్టర్ తో టాలీవుడ్ లో పత్తా లేకుండా పోయింది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా ఎఫెక్ట్ తో ఇక్కడ ఆమెకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో కోలివుడ్ కి వెళ్లి అక్కడ ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తోంది. ఇటీవల 'కథానాయకుడు' సినిమాలో చిన్న రోల్ లో కనిపించింది.

తెరపై బాలయ్య-రకుల్ కాంబినేషన్ చూడడానికి కాస్త కష్టంగానే అనిపించింది. అలాంటిది ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేయడానికి రెడీ అవుతోందట రకుల్. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించబోయే సినిమాలో రకుల్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఇప్పటికే రకుల్ తో రెండు సినిమాలు చేసిన బోయపాటి ఆమెపై మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. స్టోరీ ఓ కొలిక్కి వచ్చిన తరువాత రకుల్ కి కబురు పంపిస్తారని సమాచారం. రకుల్ కూడా ఈ సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం బాలయ్యకి హీరోయిన్లు దొరకడం కష్టంగా మారింది.

ఇలాంటి సమయంలో రకుల్ రూపంలో ఓ మంచి ఆప్షన్ దొరికిందనే చెప్పాలి. కానీ రకుల్ అప్పుడే సీనియర్ హీరోల సరసన నటించడానికి ఒప్పుకోవడం ఆమె అభిమానులను కలచి వేస్తోంది. అవకాశాలు లేని కారణంగానే ఆమె బాలయ్య సినిమాకు సై అంటోందని తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios