Asianet News TeluguAsianet News Telugu

నేను సిగ్గు పడుతుంటే చూసి దగ్గరకు వచ్చింది, అది మెమొరబుల్ మూమెంట్.. రిహానాపై రాహుల్ సిప్లిగంజ్

గల్లీ యువకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటపాడి ఆస్కార్స్ వరకు చేరుకున్నాడు.

Rahul Sipligunj interesting comments on singer Rihanna
Author
First Published Mar 21, 2023, 10:43 AM IST

గల్లీ యువకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటపాడి ఆస్కార్స్ వరకు చేరుకున్నాడు. ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. 

ఇటీవల ఇండియాకి వచ్చిన రాహుల్ సింప్లిగంజ్ కి ఘనస్వాగతం లభించింది. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి నాటు నాటు పాటని ఎంత ఎనెర్జిటిక్ గా పాడారో తెలిసిందే. ప్రపంచాన్నే ఉర్రూతలూగించారు. కెరీర్ లో అరుదైన ఘనత సాధించిన రాహుల్ సిప్లిగంజ్ గాల్లో తేలిపోతున్నాడు. అకాడమీ అవార్డ్స్ వేడుకలో ఎన్నో మెమొరబుల్ మూమెంట్స్ మూటగట్టుకుని ఇండియాకి వచ్చాడు. 

ఇండియా కు వచ్చాక రాహుల్ తాజా ఇంటర్వ్యూలో ఆస్కార్ విశేషాలని పంచుకున్నాడు. వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ రిహానాతో ఫోటో దిగడం, ఆమెతో మాట్లాడడం తన లైఫ్ లో ఒక మెమొరబుల్ మూమెంట్ ని రాహుల్ తెలిపాడు. ఆస్కార్ వేడుకలో మా రూమ్ పక్కనే రిహానా కూడా ఉన్నారు. 

 

ఆమె నడుస్తూ వెళుతుంటే ఫోటో ఎలా అడగాలబ్బా అని నేను కాలభైరవ మధనపడుతూ కనిపించాం. తనతో మాట్లాడేందుకు మేము సిగ్గు పడుతున్నాం అనే విషయాన్ని రిహానా గమనించారు. దీనితో ఆమే స్వయంగా మమల్ని పిలిచి మాట్లాడారు. ఆస్కార్ సాధించినందుకు మాకు కంగ్రాట్స్ తెలిపారు. ఆమె అమేజింగ్ లేడీ. ఆమె మనసు ఎంతో మంచిది అంటూ రాహుల్ సిప్లిగంజ్ రిహానాపై ప్రశంసలు కురిపించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios