సినిమాల మేకింగ్, ఆడియెన్స్ టేస్ట్, సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్, ఓటీటీ, టికెట్ రేట్లు వంటి అనేక అంశాలపై స్పందించారు నిర్మాత దిల్రాజు. అంతా విస్తూ పోయే విషయాలను వెల్లడించారు. ఆడియెన్స్ లో మార్పు వచ్చిందని, సినిమా మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతల్లో ఒకరు దిల్‌రాజు. ఆయన ఏడాది తన ప్రొడక్షన్ లో దాదాపు పది సినిమాల వరకు షూటింగ్ లు జరుపుతున్నారు. భారీ చిత్రాల నుంచి, చిన్న చిత్రాల వరకు అన్ని రకాల మూవీస్‌ని చేస్తున్నారు. ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్నారు. సినిమా మేకింగ్‌పై, కథల జడ్జ్ మెంట్ విషయంలో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇండస్ట్రీ పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిల్‌రాజు లేటెస్ట్ గా నిర్మించిన `థ్యాంక్యూ` చిత్రం. ఇందులో నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ రూపొందించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సినిమాల మేకింగ్, ఆడియెన్స్ టేస్ట్, సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్, ఓటీటీ, టికెట్ రేట్లు వంటి అనేక అంశాలపై స్పందించారు. అంతా విస్తూ పోయే విషయాలను వెల్లడించారు. ఆడియెన్స్ లో వచ్చిన మార్పుని ఆయన వెల్లడించారు. సినిమా మేకింగ్‌లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు.
సినిమా సక్సెస్ రేట్ దారుణంగా పడిపోయిందంటున్నారు. ప్రతి ఏడాది సక్సెస్ పర్సెంటేజ్ ఆరు ఏడు శాతం ఉండేదని, ఇప్పుడదని మరింతగా తగ్గిపోతుందని, ప్రమాద స్థాయికి పడిపోతుందని అన్నారు. పెద్ద హీరోల సినిమాల టైమ్‌లోనే జనం థియేటర్‌కి వస్తున్నారని, ఓ మోస్తారు నుంచి, చిన్న సినిమాలకు జనం రావడం లేదంటున్నారు. అయితే కరోనా తర్వాత ఆడియెన్స్ లో చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. కరోనా కారణంగా వారి కొనుగోలు శక్తి పడిపోయిందని, ఖర్చులు పెరిగాయని, దీంతో ఎంటర్‌టైన్‌కి చివరి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
పైగా ఏ సినిమా అయిన మూడు, నాలుగు వారల్లో ఫ్రీగా ఓటీటీల ద్వారా ఇంట్లోకి వస్తుందని, దీంతో ఇంట్లో వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారని, భారీగా ఖర్చులు పెట్టదలుచుకోలేదన్నారు. `అంతకు ముందు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూద్దామనే మూడ్‌లో ఉన్నారు. ప్యాండమిక్‌లో ఇంట్లో కూర్చుని చాలా కంటెంట్ చూశారు. అప్పుడు చాలా ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు వాళ్లకి అంతంతమాత్రం కంటెంట్ నచ్చట్లేదు. దీనికోసం ఇంత డబ్బు పెట్టి వెళ్లాలా? అని అనుకుంటున్నారు. ఈ విషయాల్లో మేం మారాల్సిన టైమ్ వచ్చింది. ఎలాంటి కంటెంట్‌ని ఇస్తున్నాం అనేదిప్పుడు మెయిన్ పాయింట్. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో హీరోలు 3,4 సినిమాలు లాక్ చేసుకున్నారు. ఈ కంటెంట్లతో వచ్చే కథలు సరిపోవడం లేదు. అందుకే ఇప్పుడు మేం హోమ్ వర్క్ ఎక్కువ చేయాలనుకుంటున్నాం` అని వెల్లడించారు.
ఆదివారం నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ జరిగిందని, ఇందులో ఈ విషయాలను చర్చించినట్టు తెలిపారు దిల్‌రాజు. `మా మీటింగ్‌లో మేం ప్రధానంగా చూస్తున్నది మేం ఎడ్యుకేట్ కావాలనే విషయాన్నే. నాన్ థియేట్రికల్, థియేట్రికల్ ఎకానమీ మారిపోయింది. వాటి గురించి ఎడ్యుకేట్ కావాలనుకుంటున్నట్టు తెలిపారు. తాను పది స్క్రిప్ట్ లను లాక్ చేశానని, వాటిలో రెండు సినిమాలను ఆపేశానని తెలిపారు దిల్రాజు. అంతేకాదు ఇప్పుడు ఎవరూ కొత్త సినిమాలు స్టార్ట్ చేయోద్దని చెప్పారు. మారిన ఆడియెన్స్ మైండ్ సెట్‌ని అర్థం చేసుకుని, వారికి ఏది నచ్చుతుందో వాటిపై ఫోకస్ పెట్టాలని తెలిపారు. వచ్చే ఏడాది ఆడియెన్స్ ఏం ఆలోచిస్తారు, వారికి ఏం కావాలనేదానిపై ఫోకస్ పెట్టాలన్నారు.
కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవడంపై స్పందిస్తూ, ఇది ఒకప్పుడు నిర్మాత బాధ్యత మాత్రమే. కానీ ఇప్పుడు ఇది సినిమా. అంటే అందరిది. అందరూ తగ్గించుకోవాలి. ఈ విషయాన్ని హీరోల వద్దకు కూడా తీసుకెళ్లాలని, వారికి పరిస్థితిని వివరిస్తే అర్థం చేసుకుంటారని, ఇప్పుడు హీరోలకు కూడా అన్ని తెలుస్తున్నాయని, వారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటున్నారని చెప్పారు. ఇటీవల రామ్‌చరణ్ ఈ విషయాలపై తనను అడిగారని, కూర్చోబెట్టి అన్నీ వివరించినట్టు తెలిపారు దిల్‌రాజు. ఇలా అందరు చేయాలన్నారు.
మరోవైపు ఆడిన సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి? ఆడిన సినిమాలకు ఒరిజినల్ నెంబర్స్ ఏంటి? అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారిందన్నారు. ఈ క్రమంలోనే చాలా సినిమాలు ఇటీవల కాలంలో సెటిల్ చేసుకుంటున్నారని, భారీ చిత్రాల విషయంలోనే ఈ సెటిల్మెంట్లు జరిగాయని, అవన్నీ బయటకు తెలియదన్నారు దిల్ రాజు. ఒరిజినల్ కలెక్షన్లకి, ప్రకటించే కలెక్షన్లకు తేడా ఉందనే విషయాన్ని దిల్‌రాజు పరోక్షంగా తెలిపారు. మన దగ్గర ఫ్రైడే, శనివారం, ఆదివారానికి అన్నీ వెళ్లిపోతున్నాయి. సోమవారానికి ఏమీ ఉండటం లేదు. మంచి సినిమాలకు ఆడియన్స్ ఎప్పుడూ రావడానికి సిద్ధమే. వాటికి డే బై డే పెరుగుతుందన్నారు.
`ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా, నష్టమే ఉంది. ఓటీటీలో సూపర్‌హిట్ అయినా నాకు వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే ఆ ఎనర్జీ వేరు. ఆడుతున్నకొద్దీ ఎవ్రీ డే కలెక్షన్లు వింటుంటే నిర్మాతలకు ఎనర్జీ ఇస్తుంది. సినిమా ప్యాషన్‌గా తీయాలనుకున్నవారికి ఎకానమిక్స్ మాత్రమే కాదు, ఎనర్జీ కూడా ముఖ్యమే. ఓటీటీ వల్ల పెద్ద సినిమాల నిర్మాతలకు నష్టాలున్నాయని తెలిపారు. థియేటర్లో విడుదలైన పది వారాలకు ఓటీటీలో వచ్చేలా చర్చలు జరుపుతున్నామని తెలిపారు దిల్‌రాజు.
టికెట్ రేట్లపై స్పందిస్తూ, టికెట్ రేట్లు డిస్ట్రిబ్యూటర్‌గా నా చేతిలో ఉండదు. అది ప్రొడ్యూసర్ కాల్. నా `థాంక్యూ`ని ఇప్పుడు 100 ప్లస్ జీయస్‌టీ ఇస్తున్నాం. మల్టీప్లెక్స్ లో 150 ప్లస్ జీయస్‌టి. ఇందులో 75 మల్టీప్లెక్స్ కి వెళ్తుంది. నాకు 75 వస్తుంది. తెలంగాణలో మినిమమ్ దగ్గర నుంచి మ్యాగ్జిమమ్ వరకు ఫ్లెక్సీ రేట్లున్నాయి. కానీ ఆంధ్రాలో 150 ప్లస్ జీయస్‌టీ అని జీవో ఇచ్చారు. ఒకసారి తగ్గిస్తే మళ్లీ దాని మీద మేం వర్క్ చేయాలి. దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం` అని చెప్పారు.
