Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ‘సలార్’ షూటింగ్ రీస్టార్ట్ ఎప్పుడు? నెక్ట్స్ షెడ్యూల్ వాయిదా పడిందా.!?

యంగ్ రెబల్ ష్టార్ ప్రభాస్ - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ (Salaar). తాత్కాలికంగా ఆగిన ఈ చిత్ర షూటింగ్ రీస్టార్ట్ పై క్రేజీ  బజ్ క్రియేట్ అయ్యింది. 
 

Prabhas Salaar shooting restart update, is the next schedule Postpone?
Author
First Published Sep 14, 2022, 5:47 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం రెండు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఏ మాత్రం గ్యాప్ లేకుండా ప్రభాస్ ‘సలార్’,‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ కృష్ణం రాజు (Krishnam Raju) ప్రాణాలు కోల్పోవడం ప్రభాస్ ను తీవ్ర శోకంలోకి నెట్టింది. మరోవైపు సినీ ప్రముఖులు కూడా ఆయన మరణ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ప్రభాస్, కుటుంబీకులు ఇంకా పుట్టెడు దుఃఖంలోనే ఉన్నారు. అయితే ప్రభాస్ ఈ పరిస్థితుల కారణంగా తన సినిమాల షెడ్యూల్స్ ను కాస్తా పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా ముఖ్యంగా ‘సలార్’ చిత్ర షూటింగ్ నెక్ట్స్ షెడ్యూల్ ను నెలరోజుల పాటు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అయితే గతంలో ప్లాన్ చేసిన విధంగా ఈ రోజు తదుపరి షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కృష్ణం రాజు మరణంతో నెక్ట్స్ షెడ్యూల్ ను అక్టోబర్ లో మొదటి లేదా రెండో వారంలో రీస్టార్ట్ చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్స్ ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కే’ (Project K) చిత్రాల పరిస్థితి కూడా ఇంతేనంటున్నారు. అక్టోబర్ తర్వాతే న్యూ షెడ్యూళ్లను ప్లాన్ చేయనున్నట్టు తెలుస్తోంది. 

మరోవైపు  ‘ఆదిపురుష్’ నుంచి కూడా ఈ నెల 26 ఫస్ట్ లుక్, వచ్చే నెల 3న టీజర్ విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో దసరా పండుగా సందర్భంగా అభిమానులు ‘సలార్’ నుంచి అప్డేట్స్  కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం టైటిల్ పోస్టర్స్, రిలీజ్ డేట్, ప్రభాస్ లుక్స్ ను మాత్రమే  రిలీజ్ చేశారు. ఇప్పటికే  చాలా భాగం ‘సలార్’ చిత్ర షూటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. మరికొన్ని షెడ్యూళ్లు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కృష్ణం రాజు మరణంతో మరోనెల పాటు వాయిదా పడటంతో చిత్ర షూటింగ్ ఇంకాస్తా లేట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. ‘కేజీఎఫ్’ నిర్మాతలే ‘సలార్’ను నిర్మిస్తున్నారు. సంగీతం, డీవోపీల బాధ్యతలనూ వారే చూస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios