1. విభజన తర్వాత అవినీతిలో ఆంధ్రా నంబర్ వన్
 2. చంద్రబాబు కొడుకు లోకేష్ అవినీతిలో నంబర్ వన్
 3. శేఖర్ రెడ్డి కేసులో లోకేష్ పాత్ర, ప్రధాని వద్ద సమాచారం
 4. ఇసుక, ఎర్రచందనం మాఫియాతో సర్కార్ లాలూచీ
 5. అమరావతి కేంద్రంగా మాత్రమే అభివృద్ధి జరిగితే తెలంగాణ తరహా ఉద్యమం జరిగే ప్రమాదం
 6. ఆంధ్రలో అధికారులంతా చంద్రబాబుకు వ్యతిరేకంగా వున్నారు
 7. అమరావతిలో ఎత్తైన భవనాలు కాదు, ఉన్నత ఆశయాలు కావాలి
 8. సింగపూర్ కావాలంటే సింగపూర్ తరహాలో పాలన వుండాలి
 9. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత హోదా కోసం పోరాటం ఏం చేస్తాడు
 10. జగన్ ను మోదీ నడిపిస్తున్నాడనుకోవాలా..
 11. కేంద్రం తెలుగు ప్రజలను మోసం చేస్తే చూస్తు వూరుకోం
 12. కాపుల రిజర్వేషన్ ఆచరణ సాధ్యం కాదని ముందే తెలియదా
 13. చంద్రబాబు హయంలో అమరావతి రైతులు మొదలు అన్ని వర్గాల ప్రజలకు యాతనే.
 14. అలవి కాని హామీలిచ్చి కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారు
 15. తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా బాగా సంపాదిస్తున్నారు
 16. నేను గత ఎన్నికల్లో తెదెపాకు మద్దతిచ్చింది తెదెపా అభివృద్ధి కోసం కాదు.. ఏపీ కోసం
 17. హోదా విషయంలో పార్లమెంటులో డ్రామాలు చేస్తే కుదరదు
 18. కొడుకు కోసం, కేసుల కోసమే బాబు కేంద్రంతో రాజీ పడుతున్నాడు
 19. ఓటుకు నోటు కేసు పై నేను మాట్లాడలేదని అంతా అడిగారు, ఐనా వూరుకున్నా, కానీ మీ బుద్ధి మారలేదు
 20. భయపడేందుకు నాపైన సీబీఐ కేసులు లేవు
 21. నేను నిజాయితీగా సంపాదించా. నీతిగా టాక్స్ కట్టా.
 22. నేను కానిస్టేబుల్ కొడుకును. కామన్ మ్యాన్ దీక్ష చేస్తే ఎలా వుంటుందో తెలియదు
 23. లోకేష్ అవినీతి తెలిస్తే మహానీయుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది
 24. మన బంగారం మంచిదైతే 29 సార్లు దిల్లీ వెళ్లి ఏం లాభం
 25. హోదా కోసం ఆమరణ దీక్షకైనా సిద్ధం- పవన్ కల్యాణ్
 26. నేను ఆమరణ దీక్షకు దిగాక జరిగే పరిణామాలకు నేను బాధ్యున్ని కాదు
 27. రేపు వామపక్ష పార్టీల నేతలతో సమావేశాలు