Asianet News TeluguAsianet News Telugu

రోజూ ఆయిల్ మసాజ్ చేసుకుంటా... పవన్ హీరోయిన్ నోరా ఫతేహి బ్యూటీ సీక్రెట్ లీక్డ్


హీరోయిన్  నోరా ఫతేహి తన అందం వెనకున్న రహస్యం బయటపెట్టింది. మెరిసే చర్మానికి కారణాలు వెల్లడించింది. 
 

pawan kalyan heroine nora fatehi reveals her beauty secrets
Author
First Published Mar 18, 2023, 10:05 AM IST

హీరోయిన్ నోరా ఫతేహికి ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. ఈ ప్రొఫెషనల్ డాన్సర్ అంటే పడి సచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. పరువాలు కొలతేసి తయారు చేసినట్టు ఉండే నోరా ఫతేహిని సోషల్ మీడియా జనాలు ఆరాధిస్తారు. నోరా ఫతేహిని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 44 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. స్టార్ హీరోయిన్స్ కి కూడా లేని రేంజ్ పాపులారిటీ అది. కేవలం నోరా అందాల కోసం ఆ స్థాయిలో ఆమెను ఫాలో అవుతున్నారు. 

తాజాగా నోరా ఫతేహి తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేశారు. నోరా మాట్లాడుతూ... ఎక్కువగా నీళ్ళు తాగుతాను. ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకుంటాను. వారానికి ఒకసారి గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. గ్రీన్ టీ ఆకులను తేనెలో కలిపి ముఖానికి ప్యాక్ గా పెట్టుకుంటాను. కాసేపటి తర్వాత చన్నీళ్ళతో కడుగుతాను. నా స్కిన్ కి సరిపడే ఆయిల్ తో నిత్యం మసాజ్ చేస్తాను. మా అమ్మ చెప్పిన బ్యూటీ టిప్స్ ఫాలో అవుతాను... అని చెప్పుకొచ్చారు. 

గతంలో నోరా ఫతేహి టెంపర్, బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. హరి హర వీరమల్లుతో నోరా ఫతేహి గ్లామర్ పూర్తి స్థాయిలో ఆస్వాదించే ఛాన్స్ దక్కనుంది. పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు చిత్రంలో నోరా ఫతేహి కీలక రోల్ చేస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడిగా ఉన్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nora Fatehi (@norafatehi)

కాగా నోరా ఫతేహితో షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ రిలేషన్ లో ఉన్నాడని బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. నోరా ఫతేహి, ఆర్యన్ ఖాన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం దుబాయ్ వెళ్లారట. ఇటీవల ఆర్యన్-నోరా ఫతేహి ఓ డిన్నర్ పార్టీలో సందడి చేశారు. వీరిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. మొత్తంగా ఆర్యన్ ఖాన్, నోరా ఫతేహి మధ్య రహస్య ప్రేమాయణం నడుస్తుందన్న వాదన మొదలైంది. ఇక ఆర్యన్ వయసు 25 ఏళ్లు కాగా, నోరా ఫతేహి వయసు 30. ఐదేళ్ల గ్యాప్ పెద్ద విషయమేమీ కాదు. 

ఆర్యన్ ఖాన్ గత ఏడాది అతిపెద్ద వివాదంలో ఇరుక్కున్నాడు. రేవ్ పార్టీలో పాల్గొన్న ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ ఆరోపణలపై అరెస్ట్ కాబడ్డారు. 2021 అక్టోబర్ 3న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆర్యన్ ఖాన్ ని అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్ ఖాన్ ని బయటకు తెచ్చేందుకు షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో షారుక్ మానసిక వేదన అనుభవించాడు. సినిమా షూటింగ్స్ కూడా పక్కన పెట్టి కొడుక్కి బెయిల్ తెచ్చేందుకు దేశంలోనే గొప్ప లాయర్స్ చుట్టూ తిరిగాడు. దాదాపు నెల రోజుల తర్వాత అక్టోబర్ 28న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios