సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే క్రేజీ హీరోగా మారిపోయిన వైష్ణవ్ పెద్ద బ్యానర్ల నుంచి క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నాడు.

వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన 'ఉప్పెన' సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.  దాంతో వైష్ణవ్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతూ వస్తున్నారు. తొలి సినిమాతోనే క్రేజీ హీరోగా మారిపోయిన వైష్ణవ్ పెద్ద బ్యానర్ల నుంచి క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నాడు. అయితే ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లో ఓ చిత్రాన్ని మొదలు పెట్టాడు. 

వైష్ణవ్ మొదట సినిమాకు ముందే...క్రిష్ దర్శకత్వంలో కొండపాలం సినిమా పూర్తి చేసారు. ఇప్పుడు మూడో సినిమా ని ప్రారంభించారు.  కొన్ని రోజుల క్రితమే ఆయన గిరీశాయ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.  అయితే కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు.

Scroll to load tweet…

 ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపనున్నారు. ఇది మెగా మేనల్లుడికి మూడో సినిమా. ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. బాపినీడు సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ అలరించనుంది. 'అర్జున్ రెడ్డి' సినిమాను తమిళంలో రీమేక్ చేసిన గిరీశాయ ఆశించినస్థాయి హిట్ ను అందుకోలేకపోయాడు.