ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి (Krithy Shetty)వరుసగా బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఉప్పెన లో 'జల జల జలపాతం నువ్వూ...' అంటూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులురేపిన కృతి శెట్టి, లేటెస్ట్ శ్యామ్ సింగరాయ్ మూవీలో మరోసారి రెచ్చిపోయి శృంగార సన్నివేశంలో నటించినట్లు తెలుస్తుంది. 

యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. ఉప్పెన మూవీ విజయం ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేసింది. కృతి క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ యూత్ కి తెగ నచ్చేశాయి. మొదటి సినిమాతోనే తెలుగు ఆడియన్స్ ని తన మాయలో పడేసుకుంది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన (Uppena)చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఇక దర్శకుడు సైతం కొత్తవాడే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెనతో దర్శకుడిగా మారాడు. 

బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఉప్పెన 2021 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిందంటే అర్థం చేసుకోవచ్చు, ఉప్పెన ఎంతటి ప్రభంజనం సృష్టించిందో. కాగా ఈ మూవీలో కృతి కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించారు. వైష్ణవ్ తో లిప్ లాక్ సన్నివేశాలతో పాటు శృంగార సన్నివేశంలో నటిచడం జరిగింది. అయితే ఇవన్నీ కథలో భాగమే. 

ఇక కృతి నటించిన రెండవ చిత్రం శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). డిసెంబర్ 24న విడుదలవుతుండగా... నిన్న ట్రైలర్ విడుదల చేశారు. రెండు భిన్న కాలాలకు చెందిన కథా నేపథ్యంతో శ్యామ్ సింగరాయ్ తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థమైంది. మోడరన్ పార్ట్ లో నాని గర్ల్ ఫ్రెండ్ గా కృతి శెట్టి కనిపిస్తున్నారు. అయితే ట్రైలర్ లో ఓ ముద్దు సన్నివేశంలో నాని(Nani), కృతి చాలా సహజంగా నటించారు. శృంగార తన్మయత్నం లో మునిగిపోయారు. దీనితో ఉప్పెన తరహాలో కృతి మరో బోల్డ్ సన్నివేశంలో నటించాడని సిద్దమైనట్లు హింట్ ఇచ్చారు. 

Also read `ఆర్‌ఆర్‌ఆర్‌`, `పుష్ప` మధ్యలో సాండ్‌విచ్‌ అయిపోతుంది..`శ్యామ్‌ సింగరాయ్‌`పై నాని షాకింగ్‌ కామెంట్‌

మరో బోల్డ్ సన్నివేశంలో నటించడం ద్వారా  ఫ్యాన్స్ కి కృతి ట్రీట్ ఇచ్చినట్లయింది . మరోవైపు నాగ చైతన్యకు జంటగా బంగార్రాజు మూవీ చేస్తున్నారు. బంగార్రాజు త్వరలో విడుదల కానుంది.తండ్రీ కొడుకులు నాగ్-చైతూ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ లో, నాగలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తున్నారు. అలాగే సుధీర్ కి జంటగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రం చేస్తున్నారు. ఇంకా నితిన్ లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం, హీరో రామ్ దర్శకుడు లింగుస్వామితో చేస్తున్న లేటెస్ట్ మూవీలో కృతి నటిస్తున్నారు. 

Also read డెనిమ్ షార్ట్స్ లో రష్మిక థైస్ తో.. పొట్టి బట్టల్లో నాటు స్టెప్స్ తో చంపేసిన హాట్ బ్యూటీ... వీడియో వైరల్