కొందరు కొన్ని పనులు చేస్తే ప్రపంచం విస్తుపోతుంది. రీసెంట్ గా స్వాతి నాయుడు వివాహం చేసుకుందంటే ఆశ్చర్యంపోయారు జనం. ఇదిగో ఇప్పుడు మియా ఖలీఫా కూడా పెళ్లి చేసుకోబోతోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గాప్రకటించింది. దాంతో ఆమె అభిమానులే కాదు..మిగతా ప్రపంచం కూడా షాక్ అయ్యారు. మరికొంతమందైతే అప్పుడే ఏమంత వయస్సు వచ్చిందంటూ కామెంట్స్ చేసేసారు.

ఇంతకీ మియా ఖలీఫా ఎవరో గుర్తు వచ్చిందా...  పోర్న్ సినిమాలలో సూపర్ స్టార్స్ కే స్టార్.  అతి కొద్ది సమయంలోనే ఫోర్న్ ప్రపంచానికి క్వీన్ అయ్యిపోయింది. ఆమె వీడియోలంటే కుర్రకారు పడి చచ్చేలా చేసుకుంది. 

అయితే అంత పేరు తెచ్చుకున్న ఆమె గత కొంతకాలంగా  పోర్న్ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఎవరికీ విషయం అంతుపట్టలేదు. ఆ మధ్యన ఆమెకు తమ మతస్దుల నుంచి బెదిరింపులు వచ్చాయి. దాంతో దారిలోకి వచ్చి ఇలాంటి పనులు మానేసింది అనుకున్నారు. అయితే ఆమె మనస్సులో వేరే ఆలోచనలు ఉన్నాయన్నమాట.  ప్రస్తుతం రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్న ఖలిఫా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.

మియా వయస్సు... 26 ఏళ్లు.   తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని తన అఫిషియల్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరిని చేసుకోబోతోందనేగా మీ డౌట్..  తన రెస్టారెంట్ లో చెఫ్ గా జాబ్ చేసే రాబర్ట్ శాండ్ తో గత కొన్నాళ్లుగా మియా లవ్ లో ఉందట. ఆ విషయాన్ని ఆమే చెప్పింది. రాబర్ట్ శాండ్ ను వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఆమె ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో ఆ విషయం గురించి తెగ కథనాలు వస్తున్నాయి. మియా ఖలిఫా వివాహం చేసుకోబోతున్న  సదరు రాబర్ట్  గురించి గూగుల్ ను తెగ వెతికేస్తున్నారు. మీరు కూడా ఇప్పడు వెతకటం మొదలెట్టబోతున్నారు కదా..