Asianet News TeluguAsianet News Telugu

‘మహర్షి’ బజ్ లేకపోవటానికి ఆ నిర్ణయమే కారణమా?

ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో  మహేష్‌బాబు చేస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం ఇప్పటికి దాదాపు పూర్తైంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం ఏమిటీ అంటే సినిమాకు రావాల్సినంత బజ్ క్రియేట్ కాలేదు.

Maharshi is making no buzz among movie buffs ?!
Author
Hyderabad, First Published Feb 9, 2019, 10:00 AM IST

ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో  మహేష్‌బాబు చేస్తున్న తాజా చిత్రం ‘మహర్షి’. ఈ చిత్రం ఇప్పటికి దాదాపు పూర్తైంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం ఏమిటీ అంటే సినిమాకు రావాల్సినంత బజ్ క్రియేట్ కాలేదు. చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి, మిగతా విషయాలు, సర్పైజ్ లు గురించి వార్తలు రావటం లేదు.  అందుకు కారణం ఏమిటనేది మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని కావాలనే లో ప్రొఫైల్ ని యూనిట్ వాళ్లు మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  కావాలనే ఎగ్రిసివ్ గా టీజర్స్ ని, పోస్టర్స్ విడుదల చేయటం లేదని అంటున్నారు. అందుకు కారణం...సినిమాపై అంచనాలు పెరిగిపోతే అందుకోవటం కష్టమవుతోందని, అదే లో ఫ్రొపైల్ లో రిలీజ్ అయితే అద్బుతంగా అనిపించి అదే స్దాయిలో టాక్ వస్తుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారట. మహేష్ సైతం కాస్త స్పీడు తగ్గించే వెళ్దామని, స్పైడర్ తర్వాత ఫిక్స్ అయ్యారట. 

దానికి తోడు సినిమా రైతులు సమస్యలను ప్రతిబింబిస్తుందని, మాస్ సినిమాలా ఉండదని..కాబట్టి ఫ్యాన్స్ ఈ సినిమా ఇలా ఉంటుందని ఎక్సపెక్ట్ చేయకుండా వస్తే బాగా నచ్చుతుందని అంచనాలు వేస్తున్నారట. ముఖ్యంగా అల్లరి నరేష్, మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సెకండాఫ్ లో అదిరిపోతాయని, వాటిని లీక్ కాకుండా జాగ్రత్తలు పడుతున్నారట. నరేష్ కూడా ఎక్కడా వాటి గురించి ప్రస్తావించకూడదని ముందే ఎగ్రిమెంట్ చేసుకున్నారట.

ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలబడతాయని సమాచారం. ఈ మేరకు ప్రత్యేకంగా వంశీ పైడిపల్లి కసరత్తు చేసి రూపొందించాడని సమాచారం.  అలాగే  చిత్రంలో కీలకమైన కాలేజీ ఎపిసోడ్‌లను డెహ్రాడూన్‌లో, ఇండ్రస్టిలియస్ట్ గా మహేష్ కనిపించే ఎపిసోడ్‌లను అమెరికాలో షూట్ చేశారు. ఇక ముఖ్యమైన సెకండాఫ్ ఎమోషనల్  సీన్లు అన్నింటినీ గ్రామీణ నేపథ్యంలో షూట్ చేసారు. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios