Asianet News TeluguAsianet News Telugu

మహానుభావుడు కథ కాపీనా?

  • దసరా బరిలో శర్వానంద్ ‘ మహానుభావుడు’
  • తమిళ సినిమా కాపీ  అంటూ ప్రచారం
  • కొట్టి పారేసిన డైరెక్టర్ మారుతి
mahanubhavudu movie copy what maruti says

శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ మహానుభావుడు’. ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. దసరా బరిలో ఎన్టీఆర్ జై లవ కుశ, మహేష్ స్పైడర్ చిత్రాలతో ఈ సినిమా పోటీ పడుతోంది.

 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో శర్వానంద్  ఓసీడీ అనే జబ్బుతో బాధపడుతుంటాడు. అతి శుభ్రత ఈ జబ్బు లక్షణం. తుమ్ము, దగ్గు లాంటి వాటికి కూడా చాలా దూరం పరుగెత్తే వ్యక్తి... ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే అంశంతో సినిమా తెరకెక్కుతోంది. సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

 

అయితే విడుదలకు ముందే ఈ సినిమా గురించి ఓ విషయం బయట పడింది. ఈ సినిమా.. తమిళంలో విడుదలై విజయం సాధించిన నార్త్ 24 కాథం అనే సినిమాకి కాపీ అనే ప్రచారం ఊపందుకుంది.

 

దీంతో దీనిపై మహానుభావుడు చిత్ర దర్శకుడు మారుతి స్పందించారు. ఇలాంటి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయని.. అంత మాత్రనా.. ఆ సినిమాల నుంచి కాపీ కొట్టినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. మహానుభావుడు చిత్రం ఏ సినిమాకీ కాపీ కాదని, కనీసం పోలిక కూడా ఉండదని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios