రకుల్ పెద్ద పతివ్రతలా మాట్లాడుతోంది, ఎవరికి తెలియదట-మాధవిలత

madhavi latha fire about casting couch
Highlights

రకుల్ చెప్పింది అంతా అబద్దం మాధవి లత

 

క్యాస్టింగ్ కౌచ్ అంటే మొన్నటి వరకు తెర వెనుక మాత్రమే వినిపించేది. ఎవరు కూడా బయటకి వచ్చి చెప్పేవారు కాదు. కానీ ఎప్పుడైతే హాలీవుడ్ లో ఆ వివాదం తారా స్థాయికి చేరిందో ఇండియాకి కూడా ఆ గాలి గట్టిగా వీచింది. వెంటనే ఎవరికీ వారు సోషల్ మీడియాలో మీటూ అనే ట్యాగ్స్ తగిలించేశారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నాయని రీసెంట్ గా కొంతమంది స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

పడుకుంటే అవకాశాలు వస్తాయని చెప్పిన వారు చాలామంది భామలే ఉన్నారు. అయితే రీసెంట్ గా ఓ న్యూస్ ఛానల్ లో వ్యాఖ్యాత చేసిన కామెంట్స్ కి కౌంటర్ గా కొంత మంది నటీనటులు మీడియాతో మీటింగ్ ఏర్పటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ మీటింగ్ లో రకుల్ క్యాస్టింగ్ కౌచ్ అనేదే లేదు అనే విధంగా సమాధానం ఇచ్చింది. తాను ఎప్పుడు కూడా టాలీవుడ్ లో అలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని కూడా చెప్పింది. అయితే ఆమె చెప్పింది అంతా అబద్దం అంటూ రోమ తెలుగు హీరోయిన్ స్పందించడం వైరల్ గా మారింది. ఆమె ఎవరో కాదు. నచ్చావులే - స్నేహితుడా అనే సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మాదవి లత. 

మాధవి మాట్లాడుతూ.. రకుల్ చెప్పింది అబద్దం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. హాలీవుడ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ బాధితులు చాలా మంది ఉన్నారు. బయటకు వచ్చి మీటూ క్యాంపైయిన్ ఏర్పాటు చేశారు. తెలుగులో మాత్రం ఎవరు సపోర్ట్ చేయటానికి ముందుకు రారు. ప్రతి చోట ఇది ఉంది. ఒక్క సినిమా ఇండుస్త్రీలలోనే కాదు. రకుల్ గారు చెబుతున్నది చాలా అబద్దం. హాలీవుడ్ లోనే జరుగుతోంది అంటే ఇక్కడ జరగదా?. మరి జనాలను పిచ్చోళ్ళని చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎలా ఫెస్ చేయాలి అనే విషయం గురించి చెబితే ఒకే గాని ఇలా అర్ధం లేని మాట్లాడడం కరక్ట్ కాదని మాదవి వివరించింది. 

loader