సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ - పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఫిల్మ్ ‘లైగర్’. ఈ మూవీ నుంచి ఇప్పటికే ట్రైలర్ సిద్ధమైనట్టు ప్రకటించగా.. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లోకేషన్లను అనౌన్స్ చేసింది యూనిట్.

రౌడీ హీరో, టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తన అభిమానులను అలరిస్తున్నారు. మరోవైపు ఇంటర్నేషనల్ బ్రాండ్ థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారి దేశ వ్యాప్తంగా క్రేజ్ పెంచుకున్నాడు. ఆయన కేరీర్ లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రాలు ‘లైగర్’ మరియు ‘జన గణ మన’. ఈ రెండు చిత్రాలకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడం విశేషం. జన గణ మన (JGM) ఇప్పుడు షూటింగ్ దశలోనే ఉంది. ప్రస్తుతం ‘లైగర్’ చిత్రాన్ని రిలీజ్ కు సిద్దం చేశారు. 

ఇప్పటికే ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ నుంచి వచ్చిన అప్డేట్స్ ఆడియెన్స్ కు కిక్కిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే. జూలై 21న ట్రైలర్ ను విడుదల చేస్తున్నామని మేకర్స్ అప్డేట్ అందించగా.. అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పై యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు రెండు మహా నగరాలు హైదరాబాద్, ముంబయిలో ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. 

ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తర్వాత ‘లైగర్’ రెగ్యూలర్ ప్రమోషన్స్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ - పూరీ కాంబినేషనల్ లో తొలిసారిగా వస్తున్న చిత్రం కావడం.. మరోవైపు పూరీ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత లీడింగ్ యాక్టర్ విజయ్ తో ‘లైగర్’ చేయడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 25న చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా ఫిల్మ్ గా అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది. ట్రైలర్ ను కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ చేయనున్నారు. 

విజయ్ దేవరకొండ - బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) జంటగా నటిస్తున్న ఈ చిత్రం పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూరీ జగన్నాథ్, కరణ్ జోహార్, చార్మీ కౌర్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రమ్యక్రిష్ణ, రోనిత్ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 

Scroll to load tweet…