Asianet News TeluguAsianet News Telugu

శ్రీరెడ్డి బయోపిక్.. ఎప్పుడు రాబోతుందంటే..?

కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్నాని చెప్పుకుంటోన్న నటి శ్రీరెడ్డి జీవితంతో సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'రెడ్డి డైరీస్' అనే పేరుతో ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు.

latest update on sri reddy's biopic
Author
Hyderabad, First Published Feb 11, 2019, 10:30 AM IST

కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్నాని చెప్పుకుంటోన్న నటి శ్రీరెడ్డి జీవితంతో సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'రెడ్డి డైరీస్' అనే పేరుతో ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారు. శ్రీరెడ్డి పాత్రలో ఆమె స్వయంగా నటిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమంది ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారు.

డాక్టర్ అలాదీన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి చిత్తిరై సెల్వన్ కథ, కథనాలను అందిస్తున్నారు. శ్రీరెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను, సినిమా ఇండస్ట్రీలో జరుగుతోన్న లైంగిక దోపిడీ గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారు.

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి శ్రీరెడ్డిని మోసం చేసిన కొందరు వ్యక్తుల పేర్లను కూడా సినిమాలో ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. శ్రీరెడ్డి అనుభవాలతో పాటు
పాటు ఆమె దగ్గర మరికొంతమంది ఓపెన్ అయిన విషయాలను కూడా సినిమా ద్వారా బయటపెట్టనున్నారు.

ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ అలెప్పీ, గోవాలలో చిత్రీకరించారు. రవిదేవన్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios