Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 3: నాగ్ షూట్ మొదలైంది!

రియాలిటీ షోల రారాజు బిగ్ బాస్ 3 స్టార్ట్ కావడానికి ఇంకా మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. అక్కినేని నాగార్జున ఈ సారి తన హోస్టింగ్ తో మెప్పించడానికి సిద్దమైనట్లు తెలిసిపోయింది. అయితే షో నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసి ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. 

latest update on bigg boss 3
Author
Hyderabad, First Published Jun 18, 2019, 11:43 AM IST

రియాలిటీ షోల రారాజు బిగ్ బాస్ 3 స్టార్ట్ కావడానికి ఇంకా మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. అక్కినేని నాగార్జున ఈ సారి తన హోస్టింగ్ తో మెప్పించడానికి సిద్దమైనట్లు తెలిసిపోయింది. అయితే షో నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసి ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. 

అసలు మ్యాటర్ లోకి వెళితే.. షో కోసం నిర్వాహకులు ప్రోమోస్ సిద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. స్పెషల్ గా వేసిన కొన్ని సెట్స్ లలో రోజు కనిపిస్తున్న నాగ్ బిగ్ బాస్ 3 మొదటి షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం నాగ్ తో కొన్ని ప్రోమోలను షూట్ చేస్తున్న నిర్వాహకులు త్వరలో ఒక స్పెషల్ ప్రోమోని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

బిగ్ బాస్ మొదటి రెండు సీజన్స్ లలో జూనియర్ ఎన్టీఆర్ - నాని వారి స్టయిల్లో హోస్టింగ్ చేసి మెప్పించారు. వారికి హోస్టింగ్ అదే మొదటిసారి. ఇక నాగార్జున ఇదివరకే మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ 3 కోసం రెడీ అవ్వడంతో షో పై అంచనాలు పెరిగాయి. జులైలో బిగ్ బాస్ 3 షో మొదలు కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios