Asianet News TeluguAsianet News Telugu

లక్ష్మీస్ ఎన్టీఆర్: వర్మ వాలెంటైన్స్ డే షాక్ రెడీ

సాధారణంగా వాలంటైన్స్ డే రోజున టీనేజ్ లవ్ స్టోరీలకు సంభందించిన రిలీజ్ లు, ట్రైలర్స్ విడుదల, ఫస్ట్ లుక్ లు వదలటం వంటివి చేస్తూంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ పూర్తి గా రివర్స్. ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రిలీజ్ ని ఆ రోజు పెట్టుకున్నారు. ఈ విషయం అఫీషియల్ గా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. 

Lakshmi's NTR trailer on Valentines Day
Author
Hyderabad, First Published Feb 10, 2019, 11:18 AM IST

సాధారణంగా వాలంటైన్స్ డే రోజున టీనేజ్ లవ్ స్టోరీలకు సంభందించిన రిలీజ్ లు, ట్రైలర్స్ విడుదల, ఫస్ట్ లుక్ లు వదలటం వంటివి చేస్తూంటారు. కానీ రామ్ గోపాల్ వర్మ పూర్తి గా రివర్స్. ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రిలీజ్ ని ఆ రోజు పెట్టుకున్నారు. ఈ విషయం అఫీషియల్ గా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. 

వివరాల్లోకి వెళితే.. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రేమికుల దినోత్సవం రోజున(ఫిబ్రవరి 14) ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు వర్మ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘ఎన్టీఆర్, లక్ష్మీపార్వతుల అత్యంత డైనమిక్ లవ్ స్టోరీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ డే రోజున ఉదయం 9.27 గంటలకు జీవీ ఫిలిమ్స్ సంస్థ విడుదల చేయనుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కృతజ్ఞతలేని, అవిశ్వాసవంతమైన కుటుంబసభ్యులు, వెన్నుపోటు పొడిచి మోసం చేసిన వాళ్ల కథల కలయిక. అసలైన కథని తెలుసుకొనేందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు.

పైగా ఇది కుటుంబ కుట్ర‌ల చిత్రం అంటూ పోస్టర్ పై వేసారాయన.  మొత్తానికి ఇప్పుడు బాలయ్య తన తండ్రి బయోపిక్ గా తీసిన ‘క‌థానాయ‌కుడు’ భారీ ఫ్లాప్ కావడంతో ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మార్చిలో ఇది విడుద‌ల కానుంది. మ‌హానాయ‌కుడు విడుద‌లైన త‌ర్వాత త‌న సినిమా విడుద‌ల తేదీ అనౌన్స్ చేస్తానంటున్నాడు వర్మ.

ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘వెన్నుపోటు’, ‘ఎందుకు?’ అనే పాటలు విడుదల చేసి వర్మ సంచలనం సృష్టించారు. అంతేకాక.. ఈ సినిమాలోని పాత్రలకు, సన్నివేశాలకు సంబంధించిన దృశ్యాలను రోజుకొకటి విడుదల చేస్తూ చిత్రంపై ఆసక్తి పెంచుతున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios