మహేష్ చరణ్ ల మధ్య చిచ్చు పెడుతున్న కైరా అద్వాని !

First Published 16, Mar 2018, 12:34 PM IST
kiara advani taking huge remuneration for charan film
Highlights
  • బాలీవుడ్ బ్యూటీ కియోరా అద్వానీకి బాలీవుడ్ ప్రేక్షకులలో మంచి ఇమేజ్ ఉంది
  • ఈమెను టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసి ఒక కొత్తదనం చూపెట్టాలి అన్న ఉద్దేశ్యంతో కొరటాల శివ  ‘భరత్ అనే నేను’ లో తీసుకున్నారు
  • రీసెంట్ గా చరణ్ బోయపాటి సినిమాలో కూడ తనే హీరోయిన్ గా ఎంపికైంది

బాలీవుడ్ బ్యూటీ కియోరా అద్వానీకి బాలీవుడ్ ప్రేక్షకులలో మంచి ఇమేజ్ ఉంది. దీనితో ఈమెను టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసి ఒక కొత్తదనం చూపెట్టాలి అన్న ఉద్దేశ్యంతో కొరటాల శివ ఈమెను ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాడు. మహేష్ ఈమూవీలో ముఖ్యమంత్రిగా నటిస్తున్న నేపధ్యంలో అతడికి పర్సనల్ సెక్రటరీగా కియోరా నటిస్తోంది. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమె లేటెస్ట్ గా చరణ్ సినిమాకు సంబంధించి ఆమూవీ దర్శకుడు బోయపాటికి చెప్పిన కండిషన్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. కియోరాకు ‘భరత్ అనే నేను’ మూవీలో నటించడానికి ఆమూవీ నిర్మాతలు 50 లక్షలు పారితోషికంగా ఇచ్చినట్లు టాక్. 


ఈ పారితోషికానికి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా కియోరా అద్వాని మహేష్ పేరు చెప్పగానే ఆమూవీలోని తన పాత్ర గురించి వివరాలు అడగకుండా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈమెకు ఏర్పడ్డ క్రేజ్ ను గ్రహించిన దర్శకుడు బోయపాటి తాను రామ్ చరణ్ తో తీస్తున్న మూవీలో హీరోయిన్ పాత్రకు అడిగినప్పుడు ఆమె కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేయడమే కాకుండా ఈమూవీలో తన పాత్ర గురించి వివరాలు అడిగినట్లు తెలుస్తోంది.

దీనితో కియోరా తన మొదటి సినిమా విడుదల కాకుండానే నిర్మాతలకు కండిషన్స్ పెడుతోంది అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. అంతేకాదు ఈ బాలీవుడ్ బ్యూటీ మహేష్ సినిమాకు ఒక పారితోషికం చరణ్ సినిమాకు మరో పారితోషికం డిమాండ్ చేసిన నేపధ్యంలో మహేష్ చరణ్ ల మధ్య ఆమె తేడాను చూపెడుతోందా అంటూ కొందరు ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ గాసిప్పుల పై సెటైర్లు వేస్తున్నారు..

loader