KGF సినిమా కథ ఏ క్షణాన పుట్టిందో గాని ప్రస్తుతం ఆ సినిమా రికార్డ్ ను కొట్టే వాడే లేడని చెప్పాలి. మరో సీక్వెల్ సిద్దమవుతుండడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. చప్టార్ 1 కోసం చిత్ర యూనిట్ పడిన కష్టానికి ప్రతిఫలం దొరికింది. అయితే ఈ సినిమా సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. 

దర్శకుడు రాజమౌళితో సౌత్ లో ప్రమోషన్స్ బాగానే చేశారు. కానీ బాలీవుడ్ లో ఎవరు ఈ సినిమా ప్రమోషన్స్ కు పెద్దగా సహయపడలేదు. తక్కువగా అంచనా వేశారు. అయినా కూడా సినిమా 70 కోట్ల కలెక్షన్స్ ను దాటేసి బాలీవుడ్ కి దిమ్మ తీరిగేలా షాక్ ఇచ్చింది. గత ఏడాది డిసెంబర్ 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయినా ఈ సినిమా నేటితో హాఫ్ సెంచరీ కొట్టేసింది. 

బాలీవుడ్ బడా స్టార్స్ నుంచి సినిమాకు మద్దతు రాకపోయినా సినిమా అక్కడ కూడా సక్సెస్ ఫుల్ గా 50 రోజులను పూర్తి చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో వచ్చినప్పటికీ ఇంకా కన్నడ థియేటర్స్ లో సినిమా నడుస్తోంది. కన్నడ లో మొదటగా 100 కోట్ల గ్రాస్ ను అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 225కోట్లను రాబట్టింది. దీంతో చాలా వరకు బాలీవుడ్ స్టార్స్ ఈ లెక్కలకు షాక్ అవుతున్నట్లు టాక్ వస్తోంది.