ఇలా వచ్చిందో లేదో అలా బంపర్ ఆఫర్ కొట్టేసింది యంగ్ హీరోయిన్ కేతిక శర్మ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ ఆమె ఏ సినిమాలో చేయబోతోంది...? ఏపాత్రలో మెరవబోతోంది...?
కొత మందికి కొన్ని ఛాన్స్ లు ఎన్ని ఏళ్లు వెయిట్ చేసినా రావు.. కాని కొంత మందికి మాత్రం కెరీర్ బిగినింగ్ లోనే అద్భుతమైన అవకాశాలు గుమ్మం ముందుకువచ్చి ఆగుతాయి. ప్రస్తుతం కేతిక శర్మ పరిస్థితి కూడా అంతే. ఈ మధ్యనే ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్లకు పోటీగా అవకాశాలు సాధిస్తోంది.
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన కుర్ర హీరోయిన్లలో కృతి శెట్టి .. శ్రీలీల తరువాత స్థానంలో కేతిక శర్మ కనిపిస్తుంది. రొమాంటిక్ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయమైంది. హాట్ హాట్ అందాలతో ఈ సుందరి కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది. ఆతరువాత లక్ష్య సినిమాతోను అందంగానే అలరించింది బ్యూటీ.. ఇక వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.
అయితే చేసిన రెండు సినిమాలు కూడా కథాకథనాల పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయినా సరే కేతికా శర్మకు అవకాశాలు మాత్రం అడక్కుండానే వస్తున్నట్టు సమాచారం. ఇక తన మూడో సినిమాగా వస్తున్న అంగరంగ వైభవంగా పైనే కేతిక ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆమెను మరో అవకాశం వరించినట్టుగా తెలుస్తోంది. అదీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో కావడం విశేషం.
పవన్ వినోదయా సితం అనే తమిళ రీమేక్ లో చేయనున్నారు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడు. ఆయనకి జోడీగా కేతిక శర్మను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది
