బాలయ్యపై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ అభిమానులు

First Published 29, Mar 2018, 5:43 PM IST
Jr.NTR fans angry on balakrishna
Highlights
బాలయ్యపై ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ అభిమానులు

నందమూరి ఫ్యామిలీ అంతా ఒక పక్క తారక్ ఒక పక్క. అతనికి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా నందమూరి లెగసీని ఒంటిచేత్తో లాక్కొస్తున్నాడు. వరుస హిట్లతో దూసుకుపోతున్న తారక్ ని నందమూరి వంశం ఏకాకిని చేసింది.ఈ రోజు ఉదయం ప్రారంభమయిన ఎన్టీఆర్ బయోపిక్ లాంఛ్ కు సినీ పరిశ్రమ నుండి అతిరథ మహారథులు హాజరయ్యారు. రాఘవేంద్రరావు.. బోయపాటి శ్రీను.. పూరి జగన్నాథ్.. ఎం.ఎం.కీరవాణి.. ఇలా ఎందరో సెలబ్రెటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. నందమూరి కుటుంబం నుంచి కూడా చాలామందే వచ్చారు. అందులో కళ్యాణ్ రామ్ కూడా ఉండటం విశేషం. కానీ  జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకకి ఆహ్వానించలేదు.

తమ కుటుంబానికి ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో నందమూరి ఫ్యామిలీలో దాదాపు అందరికీ ఆహ్వానాలు పంపిన బాలయ్య.. ఎన్టీఆర్ కు మాత్రం ఇన్విటేషన్ ఇవ్వలేదు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఆహ్వానం అందుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తారక్ అభిమానులు బాలయ్య మీద ఫైర్ అవుతున్నారు. అసలు ఈ బయోపిక్ కి బాలయ్య కంటే తారక్ అయితేనే పర్ ఫెక్ట్ అని సగటు ప్రేక్షకుడి అభిప్రాయం.

ఐతే ఈ వేడుకలో హరికృష్ణ కూడా లేని విషయం గమనార్హం. ఆయనకు బాలయ్య ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఐతే తన చిన్న కొడుకును పట్టించుకోనందుకో ఏమో ఆయన కూడా ఆ వేడుకలో పాల్గొనలేదు. కొంత కాలంగా హరికృష్ణ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరం పెట్టేశారు. బాలయ్య వాళ్లను అస్సలు పట్టించుకోవడం లేదు. తారక్ ను ఎవరు పట్టించుకున్న పట్టించుకొకున్న తారక్ ఇప్పుడు ఒక శిఖరం. అతని వాచకం ఆ తేజస్సు తాతను పుణికిపుచ్చుకున్న తారక్ ను దూరం పెట్టడాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

loader