Asianet News TeluguAsianet News Telugu

నితిన్ డిమాండ్.. హ్యాండిచ్చేసిన హీరోయిన్!

నితిన్ హీరోగా 'ఛలో' ఫేం దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో  ఓ సినిమా చేయాలనుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించాల్సివుంది. దీనికి 'భీష్మ' అనే టైటిల్ కూడా పెట్టారు. కథ కూడా సిద్ధంగా ఉంది. 

hero Nithin demanding high remuneration
Author
Hyderabad, First Published Feb 8, 2019, 3:54 PM IST

నితిన్ హీరోగా 'ఛలో' ఫేం దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో  ఓ సినిమా చేయాలనుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించాల్సివుంది. దీనికి 'భీష్మ' అనే టైటిల్ కూడా పెట్టారు. కథ కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. దానికి కారణం ఏంటని ఆరా తీయగా.. రెమ్యునరేషన్ దగ్గర 
రాజీ కుదరడం లేదని సమాచారం.

'లై', 'ఛల్ మోహన రంగ', 'శ్రీనివాసకళ్యాణం' ఇలా ఈ మధ్యకాలంలో నితిన్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీంతో 'భీష్మ' నిర్మాణ సంస్థ నితిన్ ని రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని అడిగారట. కానీ నితిన్ మాత్రం 'లై' సినిమాకు ముందు ఈ బ్యానర్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. దీంతో ఆ సమయంలో అనుకున్న రెమ్యునరేషనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట.

కానీ నిర్మాతలు మాత్రం పారితోషికం తగ్గించుకోవాలని అడుగుతున్నారట. ఈ విషయంలో హీరో, నిర్మాతలకు రాజీ కుదరని కారణంగానే సినిమాను ఇంకా సెట్స్ పైక్లి తీసుకువెళ్లలేదని అంటున్నారు. మరోపక్క ఎంతసేపటికి ఈ సినిమా షూటింగ్ మొదలుకాకపోవడంతో సినిమా కోసం కాల్షీట్స్ కేటాయించిన హీరోయిన్ రష్మిక ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని చూస్తుందట.

ఈ సినిమాకి బదులు అల్లు అర్జున్ సినిమా చేయాలని చూస్తోంది. ఆ సినిమాను నిర్మించేది కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ వారే కాబట్టి ఈ విషయంలో రష్మిక పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పని ఉండదు. 

Follow Us:
Download App:
  • android
  • ios