Asianet News TeluguAsianet News Telugu

'జెర్సీ' 20 సార్లు చూశా.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

hero nani interesting comments on jersey movie
Author
Hyderabad, First Published Apr 9, 2019, 11:03 AM IST

నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాతో బరువు బాగా తగ్గినట్లు చెప్పాడు నాని. కావాలని బరువు తగ్గలేదని.. క్రికెట్ ఆడి. దానికి సంబంధించిన కసరత్తులు చేయడం వల్ల తనకు తెలియకుండానే బరువు తగ్గినట్లు వెల్లడించాడు. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 20 సార్లు చూశానని.. స్క్రీన్ మీద ఉన్నది తను కాదన్నట్లు మైమరిచిపోయి మరీ సినిమా చూడడం ఇదే మొదటిసారి అంటూ చెప్పుకొచ్చాడు.

ఎప్పుడు ఏ సినిమా చూసినా.. ఎక్కడో ఒకచోట నాని బయటకి వచ్చాడని అనిపించేదని.. కానీ ఈ సినిమాలో కేవలం అర్జున్ ని మాత్రమే చూస్తారని, నటుడిగా ఈ సినిమా ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపాడు.

ఈ సినిమా తన లైఫ్ లో మోస్ట్ ఎమోషనల్ జర్నీ అని.. ఏ సినిమా విషయంలో కూడా ఇంత ఎమోషనల్ ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చాడు. 'జెర్సీ'లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు లైఫ్ లో చూసిన ఫీలింగ్ కలుగుతుందని వెల్లడించాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios