సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం ‘లడ్కీ’ ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. తాజాగా ఈ మూవీ వివాదాల్లో చిక్కుకుంది. సినిమాపై స్టే విధిస్తూ సివిల్  కోర్టు నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.   

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) దర్శకత్వం వహించిన తొలి ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ మూవీ ‘లడ్కీ’(Ladki). ఈ మూవీ ప్రస్తుతం థియేటర్ లో రన్ అవుతోంది. ‘లడ్కీ : గర్ల్ డ్రాగన్’ (Ladki : Girl Dragon) చిత్రాన్ని ఇండియాతో పాటు చైనాలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. చైనాలో 40 వేలకు పైగా స్క్రీన్స్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఇండియాలోనూ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో  జూలై 15న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. లేడీ మార్షల్ ఆర్టిస్ట్, నటి పూజా భలేకర్ (Pooja Bhalekar) ప్రధాన పాత్రలో నటించారు.  అయితే ఈ చిత్రంపై తాజాగా కోర్టు స్టే విధించింది. వర్మ నిర్మించిన ఈ సినిమాను నిలుపుదల చేయాలంటూ ఎన్. రవి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ లోని గౌరవ సిటీ సివిల్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ విషయమై ఎన్.రవి స్పందిస్తూ.. గతంలో 'లక్ష్మీస్ ఎన్ఠీఆర్' సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మాకు చెందిన  శివం సెల్లులాయిడ్స్ (Sivam Celluloids) సంస్థకు రాంగోపాల్ వర్మ అమ్మారని తెలిపారు. ఆ తర్వాత మాకు హక్కులు ఉన్నప్పటికీ, ముంబై కి చెందిన మరో సంస్థకు తమకు తెలియకుండానే రైట్స్ ను అమ్మారని వాపోయారు. ఈ నేపథ్యంలో అనేకమార్లు వర్మను సంప్రదించినా.. ఫిలిం ఛాంబర్ లో పిర్యాదు చేసినా.. ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. 

దీంతో కోర్టు ఈ నెల 14న రాంగోపాల్ వర్మ రూపొందించిన 'లడకీ" సినిమా ప్రదర్శనను నిలుపుదల చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అన్నిరకాల డిజిటల్, ప్లాట్ ఫామ్స్ లో కూడా సినిమాను అమ్మడానికి కానీ బదిలీ చేయడానికి, కానీ ప్రదర్శించడానికి  వీలులేకుండా  తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని ఆయన చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మతో పాటు చైనీస్ డైరెక్టర్ జింగ్ లియూ దర్శకత్వం వహించారు. ఆర్ట్సీ మీడియా ప్రొడక్షన్, స్పార్క్ బ్యానర్లపై మూవీని నిర్మించారు. ప్రధాన పాత్రలో పూజా భలేకర్ నటించిన విషయం తెలిసిందే.. మిగిలిన పాత్రల్లో మియా ముఖి, అభిమన్యు సింగ్ నటించారు.