Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి చేతులు మీదుగా బాబీ సింహా `వసంత కోకిల` ట్రైలర్ విడుదల

`వాల్తేర్‌ వీరయ్య`లో విలన్‌ గా నటించి మెప్పించాడు జాతీయ అవార్డు విన్నర్‌ బాబీ సింహా. ఆయనహీరోగా నటించిన చిత్రం `వసంత కోకిల`.  ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్‌ చేసి చిత్ర బృందానికి, బాబీ సింహాకి అభినందనలు తెలియజేశారు. 

chiranjeevi released bobby simha starrer vasantha kokila movie trailer
Author
First Published Feb 6, 2023, 6:02 PM IST

ఇటీవల `వాల్తేర్‌ వీరయ్య`లో విలన్‌ గా నటించి మెప్పించాడు జాతీయ అవార్డు విన్నర్‌ బాబీ సింహా. ఆయనహీరోగా నటించిన చిత్రం `వసంత కోకిల`. రమణన్‌ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రాన్ని మధుర ఫిలిమ్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకాలపై రజనీ తాళ్లూరి, రేష్మి సింహా నిర్మించారు. ఇందులో బాబీ సింహా సరసన కాశ్మీర హీరోయిన్‌గా నటిస్తుంది.నాలభై ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించిన సూపర్‌ హిట్‌ టైటిల్‌ `వసంతకోకిల`తో ఈ సినిమా రూపొందుతుండటంతో ఆసక్తి నెలకొంది. 

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.  ఈ సినిమాను తెలుగులో రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ ను అధికారికంగా విడుదల చేసారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రీలిజ్ చేయగా, కన్నడ ట్రైలర్‌ను శివరాజ్‌ కుమార్ లాంచ్‌ చేశారు. చిత్ర బృందానికి, బాబీ సింహాకి అభినందనలు తెలియజేశారు. 

ట్రైలర్ మొదటి నుండి చివరివరకు మంచి ఆసక్తికరంగా కట్ చేసారు. బాబీ సింహా-కశ్మీర పరదేశీ  లవ్‌ ట్రాక్‌ తో పాటు వారి చుట్టూ జరిగి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో అర్ధమవుతుంది. మిస్టరీ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాబీ సింహా రుద్ర పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ నటుడు ఆర్య కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ట్రైలర్ లో రాజేష్ మురుగేషన్ అద్భుతమైన బాక్గ్రౌండ్ స్కోర్ తో ఆసక్తిని పెంచాడు. రమణన్‌ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తున్న `వసంత కోకిల` చిత్రం  తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇక చిరంజీవి హీరోగా, రవితేజ ముఖ్య పాత్రలో నటించిన `వాల్తేర్‌ వీరయ్య` చిత్రంలో సెకండ్‌ విలన్‌గా నటించారు బాబీ సింహా. ఫస్టాఫ్‌ వరకు ఆయన పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఇందులో తనదైన నటనతో మెప్పించారు బాబీ సింహా. ఈ సినిమా పరిచయంతోనే ఇప్పుడు `వసంత కోకిల` ట్రైలర్‌ని ఆవిష్కరించారు చిరు. 

తారాగణం - సింహా, కాశ్మీర పరదేశి, రచన , దర్శకత్వం - రమణన్ పురుషోత్తమ, నిర్మాతలు - రజనీ తాళ్లూరి & రేష్మి సింహా, సంగీత దర్శకుడు - రాజేష్ మురుగేశన్, DOP - గోపీ అమర్‌నాథ్, ఎడిటర్ - వివేక్ హర్షన్, కలరిస్ట్ - సేతు సెల్వం, సౌండ్ డిజైన్ - తపస్ నాయక్, ప్రొడక్షన్ డిజైన్ - నాగరాజ్ ఆర్కే, సాహిత్యం - చంద్రబోస్, రాకేందు మౌళి (తెలుగు)
సంభాషణలు - రాజేష్.ఎ.మూర్తి (తెలుగు), యాక్షన్ డైరెక్టర్ - స్టన్నర్ సామ్ & స్టంట్ సిల్వా, కాస్ట్యూమ్ డిజైనర్ - నందిని ఎన్కే, రక్షా రవికుమార్, కొరియోగ్రఫీ - ఎం షెరీఫ్ & విజిసతీష్
పబ్లిసిటీ డిజైన్స్ - ట్యూనీ జాన్ - 24AM, స్టిల్స్ - శ్రీ బాలాజీ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - ఆర్ పి బాల గోపి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సతీష్ సుందర్‌రాజ్, లైన్ ప్రొడ్యూసర్స్ - J విద్యా సాగర్ & U Deleep కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్ - చెన్నూరి మహేందర్, ఆర్ జయ కుమార్, ప్రొడక్షన్ మేనేజర్ - విశ్వనాథన్, PRO - ఏలూరుశ్రీను & మేఘశ్యామ్  (తెలుగు). 

Follow Us:
Download App:
  • android
  • ios