Asianet News TeluguAsianet News Telugu

‘గరుడవేగ’లో పాజిటివ్ అయితే…‘కల్కి’లో నెగిటివ్

 తెలుగులో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న  యువ నటుడు చ‌ర‌ణ్‌ సూరినేని. ‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలో కనిపించిన చరణ్.. వరుణ్ తేజ్ హీరోగా ‘లోఫర్’లో మెయిన్ విలన్ గా నటించాడు. ఆ సినిమా చ‌ర‌ణ్‌దీప్‌కి చక్కటి గుర్తింపు తీసుకొచ్చింది. 

Charan Surineni undergoes new makeover
Author
Hyderabad, First Published Feb 7, 2019, 7:44 PM IST

తెలుగులో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న  యువ నటుడు చ‌ర‌ణ్‌ సూరినేని. ‘బాహుబలి’లో కాలకేయ తమ్ముడిగానూ, ‘పీఎస్వీ గరుడవేగ’లో పోలీస్ పాత్రలో కనిపించిన చరణ్.. వరుణ్ తేజ్ హీరోగా ‘లోఫర్’లో మెయిన్ విలన్ గా నటించాడు. ఆ సినిమా చ‌ర‌ణ్‌దీప్‌కి చక్కటి గుర్తింపు తీసుకొచ్చింది. 

తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకోవటమే ప్లస్ అవుతోంది. ఇక  చరణ్ సూరినేని తాజాగా సరికొత్త మేకోవ‌ర్‌లోకి రావటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జుట్టు బాగా పెంచి, కొంచెం గడ్డంతో స్టైల్‌గా కనిపిస్తున్నాడు. దాంతో తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల దర్శక,నిర్మాతల దృష్టి ఆయనపై పడింది. 

చరణ్ సూరినేని మాట్లాడుతూ “రాజశేఖర్ గారి ‘పీఎస్వీ గరుడవేగ’లో పాజిటివ్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటించాను. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. మళ్లీ రాజశేఖర్ హీరోగా  తెరకెక్కుతున్న ‘కల్కి’లో నేను పోలీస్ పాత్రలో నటిస్తున్నా. ‘గరుడవేగ’లో నాది పాజిటివ్ క్యారెక్టర్ అయితే… ‘కల్కి’లో నెగిటివ్ క్యారెక్టర్. ఈ సినిమాతో పాటు చిరంజీవిగారితో ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నా. 

ఇప్పటికి ఓ పది సినిమాల్లో నటించాను. శివ కార్తికేయన్, సమంత, కీర్తీ సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సీమ రాజా’లో నా పాత్రకూ మంచి స్పందన వచ్చింది. శుక్రవారం ఈ సినిమా తెలుగులో విడుదల అవుతుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తమిళంలో ఓ భారీ సినిమాలో నటిస్తున్నా. కొత్త సినిమాల కోసం సరికొత్త మేకోవ‌ర్‌లోకి వచ్చాను. ” అన్నారు. 

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి  హీరోగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక ‘సైరా నరసింహారెడ్డి’, యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కల్కి’ చిత్రాల్లో చరణ్ దీప్ నటిస్తున్నాడు. ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘సీమరాజా’లో చరణ్ సూరినేని కీలక పాత్రలో నటించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios