బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. ఇటీవల ‘గెహ్రైయాన్’ చిత్రంలో బోల్డ్ సీన్లలో నటించగా.. తాజాగా దీపికా మిడిల్ ఫింగర్ చూపించిన పిక్ వైరల్ గా మారింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లామర్ బ్యూటీ దీపికా పదుకొనే  ఏం చేసినా సెన్సేషనే అవుతుంది. సోషల్ మీడియాను తను గుప్పిట్లో పెట్టుకునే అతికొద్ది మంది హీరోయిన్లలో దీపికా పదుకునే ఒకరని చెప్పొచ్చు. మీడియా ఫోకస్ అంతా తనపైనే ఉన్నా.. డేరింగ్ చేయడంలో ఈ హీరోయిన్ ముందుంటుంది.  దీపికా పదుకునే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖాన్ (Shah Rukh Khan)తో కలిసి ‘పఠాన్’ Pathan చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ స్పెయిన్ లోని షూటింగ్ లో బిజీగా ఉంది. అక్కడ దీపికా పదుకునే, షారుఖ్ ఖాన్ కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. 

అయితే పఠాన్ సెట్ నుంచి కొన్ని ఫొటోలు తాజాగా కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులోని ఒక చిత్రంలో దీపికా పదుకునే వైట్ బ్రా, అరెంజ్ కలర్ స్కర్ట్ ను తన నడుముకు చుట్టుకొని కనిపిస్తుంది. ఆమె పక్కనే షారుఖ్ ఖాన్ కూడా నిల్చొని ఉండటాన్ని చూడవచ్చు.  కాగా, మరోచిత్రంలో దీపికా పదుకునే, షారుఖ్ ఖాన్ ఫుల్ బ్లాక్ డ్రెస్ లో కనిపించారు. షారుఖ్ ఖాన్ బ్లాక్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు. ఇక దీపికా పదుకునే ఫుల్ లెన్త్ కోట్ లో రెండు చేతులు పైకెత్తి మిడిల్ ఫింగర్ ను చూపిస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు దీపికా ఎవరికి మిడిల్ ఫింగర్ చూపించిదంటూ చర్చించుకుంటున్నారు. 

 

View post on Instagram
 

కొంత, సమాచారం మేరకు  దీపికా పదుకొణె  పఠాన్ షూటింగ్‌లో భాగంగానే అలా మిడిల్ ఫింగర్ చూపించిందంట. ఏదేమైనా దీపికా అలాంటి గెస్చర్ లో కనిపించడంతో అంతా షాక్ అయ్యారు.ప్రస్తుతం ఇంకా ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా సెట్స్ నుంచి గతం వారం కూడా స్విమ్ సూట్ లో ఉన్న ఫొటోలు లీక్ అవడం పట్ల దీపికా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. మళ్లీ  ఈ పిక్ కూడా లీక్ అవడంతో మున్ముందు ఎలా స్పందిస్తుందో చూడాలి. 

ఇక, తను చివరిగా గెహ్రైయాన్ (Gehraiyaan) మూవీలో బోల్డ్ సీన్లలో నటించి హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీపికా, నటుడు సిద్దాంత్ చతుర్వేదితో కలిసి లిప్ లాక్ సీన్ లో నటించడం మొన్నటి వరకూ నెట్టింట దూమారం రేపింది. వీటిపై దీపికా స్పందిస్తూ.. తనకు నటన అంటే ఇష్టమని, నేను ఎవరికీ బదులివ్వాల్సిన అవసరం లేదని, తన భర్త తనను అర్థం చేసుకోగలడని పేర్కొన్న విషయం తెలిసిందే.