Asianet News TeluguAsianet News Telugu

Bangarraju: ‘బంగార్రాజు’ 8 రోజుల కలెక్షన్స్,డ్రాప్ ఎంతశాతం?


ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా కొంచం గ్రోత్ ని చూపెట్టినా కానీ ఓవరాల్ గా… సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం  ఉంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే కాస్త డ్రాప్ కు కళ్లెం పడే  అవకాశం ఉంది.

Bangarraju 8 days collections revealed
Author
Hyderabad, First Published Jan 22, 2022, 3:30 PM IST


బాక్స్ ఆఫీస్ దగ్గర నాగార్జున మరియు  నాగ చైతన్య ల  మూవీ బంగార్రాజు రెండో వారంలో అడుగు పెట్టింది.  వీకెండ్ లో దంచి కొట్టిన ఈ సినిమా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం స్లో డౌన్ అయింది. సినిమా కి పోటి ఇచ్చే సినిమా కూడా ఏమి లేకున్నా కానీ  నైజాం ఏరియాలో సినిమా ఎక్కువ డ్రాప్స్  రావడం ఓవరాల్ కలెక్షన్స్ పై గట్టి ఇంపాక్ట్ నే క్రియేట్ చేసిం. మొత్తం మీద సినిమా 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 40% కి పైగానే డ్రాప్స్ కనపడుతోంది.

ఈవినింగ్ అండ్ నైట్ షోల టైం కి సినిమా కొంచం గ్రోత్ ని చూపెట్టినా కానీ ఓవరాల్ గా… సినిమా బ్రేక్ ఈవెన్ కోసం మరింత కష్టపడాల్సిన అవసరం  ఉంది. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే కాస్త డ్రాప్ కు కళ్లెం పడే  అవకాశం ఉంది. ఏమైనా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా కష్టపడాల్సి ఉంటుంది… మరి వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.


నైజాం:      రూ.7.67 కోట్లు

సీడెడ్ :    రూ. 6.01 కోట్లు

ఉత్తరాంధ్ర :           రూ.4.47 కోట్లు

ఈస్ట్ గోదావరి :         రూ.3.61 కోట్లు

వెస్ట్ గోదావరి :        రూ.2.58 కోట్లు

గుంటూరు :     రూ.3.07 కోట్లు

కృష్ణా :    రూ.1.98  కోట్లు

నెల్లూరు :     రూ.1.55 కోట్లు

మొత్తం ఆంధ్రా,తెలంగాణా కలెక్షన్స్  :రూ.30.94 కోట్లు షేర్ (రూ.50.02 కోట్లు గ్రాస్)

కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా:రూ.1.63 కోట్లు

ఓవర్ సీస్ :                  రూ.1.37 కోట్లు

మొత్తం ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్: రూ.33.94 కోట్లు (రూ.56.80 కోట్లు గ్రాస్)

అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉండటంతో ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీస్ ఈ సినిమా చూడటానికి క్యూ కడుతున్నారు.  చాలా కాలం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు.   పైగా పాజిటివ్ టాక్.. పైగా పోటీలో పెద్ద సినిమాలేని లేకపోవడం బాగానే కలిసొచ్చింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios