ముద్దులిస్తూ.. కన్ను కొడుతూ కవ్విస్తున్న రష్మీ గౌతమ్.. స్టార్ యాంకర్ ఇలా చేస్తే కుర్రాళ్ల పరిస్థితి అంతే!

బుల్లితెర అందాల యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) ప్రస్తుతం వేకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా చిలిపి చేష్టలతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ క్రేజీ వీడియోను అభిమానులతో పంచుకుంది. 
 

Anchor Rashmi Gautam enjoying her vacation

‘జబర్దస్త్’ యాంకర్ గా బుల్లితెర ఆడియెన్స్ లో యాంకర్ రష్మీ గౌతమ్ మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. తనదైన యాంకరింగ్ స్కిల్స్, చలాకీతనం, సమయస్ఫూర్తితో టీవీ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది. మరోవైపు గ్లామర్ తోనూ యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బుల్లితెరపై అదిరిపోయే అవుట్ ఫిట్లలో మతిపోయేలా డాన్స్ పెర్ఫామెన్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది కూడానూ... ఇదే సమయంలో క్రేజీగా ఫొటోషూట్లు కూడా చేస్తూ  ఆకట్టుకుంటోంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. 

Anchor Rashmi Gautam enjoying her vacation

బుల్లితెరపై తిరుగులేని కేరీర్ ను చూస్తున్న యాంకర్ రష్మీ అప్పుడప్పుడు వేకేషన్లు, టూర్లకు వెళ్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ క్రేజీ వీడియోను అభిమానులతో పంచుకుంది. స్లీవ్ లెస్ గౌన్ లో టాప్ గ్లామర్ విందు చేసింది. కెమెరాకు దగ్గరగా క్లోజప్ ఫోజులతో కట్టిపడేసింది. ముద్దులిస్తూ.. కన్నుగీటుతూ.. మునుపంటితో పెదవిని కొరుకుతూ కుర్రాళ్ల ప్రాణం తోడేసింది. చిరునవ్వుతో, మత్తు చూపులతో నెటిజన్ల గుండెల్లో బాణాలు దింపింది. ఇంత క్రేజీగా ఫొటోషూట్ చేసిన రష్మీగౌతమ్ కవ్వింపు చర్యలకు నెటజన్లు అదిరిపోయేలా కామెంట్లు కూడా పెడుతున్నారు.

Anchor Rashmi Gautam enjoying her vacation

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే రష్మీ గౌతమ్ ఆయా  సోషల్ ఇన్సిడెంట్స్ పైనా స్పందిస్తుంటారు. తనదైన శైలిలో ప్రశ్నలు కురిపిస్తుంటారు. లాక్ డౌన్ సమయంలోనూ మూగజీవాలకు ఆహారం అందించి మంచి మనస్సు చాటుకుంది. ఇలా పలు సందర్భాల్లో తనశైలిని చూపిన విషయం తెలిసిందే. ఇక బుల్లితెరపైన ఇటీవల కాస్తా బోల్డ్ కామెంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ‘జబర్దస్’యాంకర్ గా కొనసాగుతోంది. 

Anchor Rashmi Gautam enjoying her vacation

యాంకర్ రష్మీ ఇన్నాళ్లు  యాంకర్ గానే అందరికీ పరిచయం ఉన్నారు. కానీ యాంకర్ గా అవతారం ఎత్తేందుకు ముందు నటిగానే కేరీర్ ప్రారంభించింది. సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తూ ప్రేక్షకులను అలరించింది.  కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. యాంకర్ గా గుర్తింపు దక్కించుకున్న తర్వాత హీరోయిన్ గా తన కలను నెరవేర్చుకుంది. ‘గుంటూరు టాకీస్’, ‘అంతం’,  ‘నెక్ట్స్ నువ్వే’, ‘అంతకు మించి’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో నటిస్తోంది. మరిన్ని అవకాశాల కోసమూ ఎదురుచూస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios