తానింకా కన్య నేనట. పెళ్లయ్యాకే చేస్తానంటోంది

First Published 21, Feb 2018, 5:40 PM IST
amyra dastur says she is still virgin
Highlights
  • మనసుకు నచ్చింది చిత్రంతో ఇటీవలే తెలుగు  ప్రేక్షకుల ముందుకొచ్చిన అమైరా
  • తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కన్యత్వం గురించి మాట్లాడిన అమైరా
  • తానింకా కన్యనేనని, పెళ్లయ్యాకే చేస్తానని చెప్తోంది అమైరా

మనసుకు నచ్చింది చిత్రంతో తెలుగు తెరంగేట్రం చేసిన ముంబై భామ అమైరా దస్తూర్. అందంతో కుర్రకారును ఎట్రాక్ట్ చేసిన అమైరా మనసుకు నచ్చింది సక్సెస్ కాకున్నా... ఇప్పటికే రాజుగాడు అంటూ రాజ్ తరుణ్ తో చేసిన మరో సినిమా రిలీజ్ కి రెడీగా కూడా ఉంది. ముంబై బ్యూటీ అమైరా సెన్సేషనల్ కామెంట్స్ చేయడంలో ఏమాత్రం వెనుకాడదు.

 

క్లీవేజ్ అందాల ప్రదర్శనకు సైతం వెనుకాడని అమైరా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ర్యాపిడ్ ఫైర్ మాదిరిగా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. వీటిలో తన కన్యత్వం గురించిన ప్రశ్నకు అమైరా ఇచ్చిన ఆన్సర్.. హైలైట్ అవుతోంది. ప్రస్తుతం 24 సంవత్సరాల వయసు గల అమైరాకు.. ఏ వయసులో వర్జినిటీ పోగొట్టుకున్నారు అనే ప్రశ్న ఎదురైంది.

 

వర్జినిటీపై ప్రశ్నకు సమాధానంగా... 'ఎవరు చెప్పారు నేనింకా కన్యను కాదని.. నా పెళ్లి జరిగే వరకూ నేను వర్జిన్ గానే ఉంటాను' అంటూ టకీమని ఆన్సర్ ఇచ్చింది ఈ ముంబై భామ. గ్లామర్ వరల్డ్ లో ఉండడంతో.. ఈ ప్రశ్నకు వేరే సమాధానం కానీ.. పాస్ చేయడం లాంటివి కానీ జవాబుగా వస్తాయని అనుకుంటే.. అమ్మడు కొట్టినట్లుగా ఆన్సర్ ఇచ్చింది.

 

ఇక తన సెలబ్రిటీ క్రష్ రణబీర్ కపూర్ అంటున్న అమైరా దస్తూర్.. ఒకవేళ తనకు సూపర్ పవర్స్ కానీ ఉంటే.. మెరుపు మాదిరి వేగాన్ని ఎంచుకుంటుందట. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి ఏదైనా మార్చగలిగితే మాత్రం.. అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ ఎంపిక కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుందట. ట్రంప్ ఈమెను ఏమన్నాడో మరి.

loader